Home » Entertainment » Surekhavani About On He
Entertainment

Surekhavani : అవసరానికి వాడుకొని ఇప్పుడు వదిలేశారు-నటి సురేఖా వాణి సెన్సేషనల్ కామెంట్స్..!

Authored By
aruna
The Telugu News | Published on: October 12, 2023, 8:00 pm
Advertisement

Surekhavani  : తెలుగు పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణికి ఎంతో గుర్తింపు ఉంది. ఎన్నో తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లిగా , అక్కగా, వదినగా పాత్రలు చేశారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈమె తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అవికాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Advertisement

అప్పుడప్పుడు పార్టీలు, వెకేషన్ లకు వెళుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు సురేఖ వాణి. సినిమాలో నటన కన్నా ఆమె సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో సురేఖ వాణికి సినిమాల మీద ఆసక్తి తగ్గిందేమో అని అంటున్నారు. ఈమధ్య కాలంలో సురేఖవాణి డబ్ స్మాష్ వీడియోలను తెగ చేస్తున్న సంగతి తెలిసిందే.

Surekhavani about on he

Advertisement

మరీ ముఖ్యంగా ఈమె వైయస్ షర్మిల వీడియోలను షేర్ చేస్తూ వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నాకు ఎవరూ లేరు ఉండాలని కూడా అనుకోవడం లేదు, మీలాగా లేని ప్రేమలు నటించే లైఫ్ నాది కాదు అంటూ వీడియో షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది నిజజీవితంలో సురేఖవాణిని ఎవరైనా వాడుకొని వదిలేసారా, అందుకే ఇలా ఫీల్ డైలాగ్ చెప్పినట్లు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సురేఖ వాణి సోషల్ మీడియాలో మరోసారి ఇలా వైరల్ గా మారారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి