Home » Entertainment » Sushmita Konidela Comments About Upasana Pregnancy
Entertainment

Sushmita Konidela : ఏంటి బ్రో అంత మాట అనేసింది.. ఉపాసన ప్రెగ్నెన్సీపై చిరంజీవి కూతురు సుష్మిత కామెంట్స్ వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 16, 2023, 1:00 pm
Advertisement

Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం రెండు విషయాలు. ఒకటి తన కోడలు గర్భం దాల్చడం, మరొకటి వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవ్వడం. తను తాత అవుతున్నానని తెలిసినప్పుడు చిరంజీవి చాలా సంతోషించారు. వెంటనే ట్విట్టర్ లో తాను తాత కాబోతున్నట్టు ప్రకటించారు. దాదాపు పదేళ్లుగా మెగా వారసుడి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. ఉపాసన త్వరలో తల్లి కాబోతుందని, రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని ఏకంగా చిరంజీవే సోషల్ మీడియాలో ప్రకటించారు.

Advertisement

దీంతో మెగా అభిమానుల సందడే కాదు. మెగా అభిమానులు పండుగ చేసుకున్నారు.ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణమే ఉపాసనపై కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆమె సరోగసి ద్వారా బిడ్డను కంటోంది అంటూ వార్తలు వచ్చాయి. లేదు ఆమెకు ట్విన్స్ పుడతారు అంటూ.. లేదు ఆమెకు ఏదో ప్రాబ్లమ్ ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆమె స్పెషల్ గా ఏదో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఇటీవల రామ్ చరణ్ సోదరి సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sushmita Konidela comments about upasana pregnancy

Advertisement

Sushmita Konidela : రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డపై సుష్మిత ఏం కామెంట్స్ చేసిందంటే?

మా తమ్ముడు తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన వెంటనే మాకు చాలా సంతోషం వేసింది. మేమంతా ఆ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేశాం. మా ఆనందానికి అయితే అవధులు లేవు. అయితే మా తమ్ముడికి పుట్టేది పాపా లేక బాబా అనేది తెలియదు కానీ.. నాకు అయితే చరణ్ కు బాబు పుట్టాలని ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. చరణ్ కు కొడుకు పుడితే.. మాకు ఆ కోరిక తీరుతుంది.. అంటూ సుష్మిత కామెంట్స్ చేసింది. తన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి