Home » Entertainment » Sushmita Sen Dating With 9 Persons
Entertainment

Sushmita Sen : 9 మందితో డేటింగ్‌, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధ‌మైన స్టార్ హీరోయిన్..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 16, 2022, 9:30 pm
Advertisement

Sushmita Sen : మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచింది. అయితే రీసెంట్‌గా తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్‌ మోదీ సోషల్‌ మీడియా వేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నప్పటికీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్‌ మీడియా వేదికగా వారి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెట్టాడు లలిత్‌ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమెను భాగస్వామిగా పేర్కొన్నాడు.

Advertisement

దీంతో ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నార‌ని ప్ర‌చారాలు న‌డిచాయి. అయితే దీనిపై సుష్మితా స్పందిస్తూ ‘ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి అవలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ వివరణ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్‌ యూ గయ్స్‌..’ అని రాసుకొచ్చింది. అయితే సుష్మితా వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, లలిత్‌ మోదీతో సహా 9 మందితో సహాజీవనం చేసినట్లు తెలుస్తోంది.

sushmita sen dating with 9 persons

Advertisement

Sushmita Sen : బాబోయ్.. ఏంటి ఈ వ్య‌వ‌హారం..

సుష్మితా పలువురు నటులు, క్రికెటర్‌, వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. అంతమందితో ప్రేమలో పడ్డ ఆమె కేవలం డేటింగ్‌ వరకు పరిమితమైంది. మొన్నటి దాక తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తోంది మూడేళ్లు సహాజీవనం చేసిన ఆమె గతంలో క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌, నటుడు రణ్‌దీప్‌ హుడా, డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌, ముద్దాసిర్‌, మానవ్‌ మీనన్‌లతో కొన్నేళ్ల పాలు సహాజీవనం చేసింది. ఇక బడా వ్యాపారవేత్తలైన రితిక్‌ ఖాసిన్‌, సబీర్‌, సంజయ్‌ నారంగ్‌, ఇంతియాజ్‌లతో కూడా గతంలో ఆమె డేటింగ్‌ చేసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి