Sushmita Konidela : నాకు చ‌ర‌ణ్‌కి గొడ‌వ‌లు పెట్టి ప‌వ‌న్ ఎంజాయ్ చేసేవాడు.. చిరంజీవి కూతురు చెప్పిన సీక్రెట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sushmita Konidela : నాకు చ‌ర‌ణ్‌కి గొడ‌వ‌లు పెట్టి ప‌వ‌న్ ఎంజాయ్ చేసేవాడు.. చిరంజీవి కూతురు చెప్పిన సీక్రెట్

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2024,6:59 pm

Sushmita Konidela : ఏపీ ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుండి కూడా ఆయ‌న పేరు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రు కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి, ఆయ‌న వ్య‌క్తిత్వం గురించి, ప‌వ‌న్ కి సంబంధించిన ప‌లు విష‌యాల గురించి గుర్తు చేసుకుంటున్నారు. టీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు తనపార్టీ నుంచి నిలబెట్టిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో వ‌చ్చిన తాజా వెబ్ సిరీస్ ‘పరువు’ .

Sushmita Konidela : ప‌వ‌న్ అంత చిలిపా..

గోల్డెన్ బాక్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ బ్యాన‌ర్‌పై సుస్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌గా నివేదా పేతురాజ్‌, నరేష్ అగస్త్య నాగ‌బాబు కీల‌క పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కొన్ని రోజుల క్రితం పోలీసుల‌తో గొడ‌వ‌ప‌డిన‌ట్లు వీడియోలు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఆ గొడ‌వ అంతా ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చేసారు.. అయితే ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జీ5లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌కు పాజిటివ్ టాక్ రావ‌డంతో తాజాగా సుస్మిత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో త‌న బాబాయ్ ఏపీ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది సుస్మిత.

Sushmita Konidela నాకు చ‌ర‌ణ్‌కి గొడ‌వ‌లు పెట్టి ప‌వ‌న్ ఎంజాయ్ చేసేవాడు చిరంజీవి కూతురు చెప్పిన సీక్రెట్

Sushmita Konidela : నాకు చ‌ర‌ణ్‌కి గొడ‌వ‌లు పెట్టి ప‌వ‌న్ ఎంజాయ్ చేసేవాడు.. చిరంజీవి కూతురు చెప్పిన సీక్రెట్

బాబాయ్‌ పవన్‌తో అనుబంధం గురించి చెబుతూ, చిన్నప్పుడు మమ్మల్ని బాగా ఆటపట్టించేవాడట. రామ్‌చరణ్‌, నా మధ్య గొడవలు పెట్టేవాడు. మేం గొడవలు పడుతుంటే ఆయన ఎంజాయ్‌ చేసేవాడు. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మమ్మల్ని వాడుకునేవాడు. అలాంటి నాటీ, చిలిపి యాంగిల్‌ కూడా బాబాయ్‌లో ఉంది` అని తెలిపింది సుస్మిత. కల్యాణ్ బాబాయిలో గత పదేళ్లుగా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఆయనను చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో నాకు పెద్దగా నాలెజ్డ్ లేదు కానీ.. బాబాయి గెలవాలని ప్రేయర్స్ చేశాను. ఆయ‌నను చూసిన‌ప్పుడ‌ల్లా ధ‌ర్మం ఎప్ప‌టికైనా గెలుస్తుంది అనుకునేదాన్ని. అదే న‌మ్మాను. అలాంట‌ప్పుడు విమర్శలు, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయవు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు నాకు మాత్రం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి’ అని ఎమోషనలైంది సుస్మిత.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది