Home » Entertainment » Sv Ranga Rao Love With Her After Marriage
Entertainment

SV Ranga Rao : పెళ్లి తరవాత కూడా ఆ హీరోయిన్ అంటే పడి చచ్చిపోయేవాడు ఎస్వీ రంగారావు ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 22, 2023 1:17 pm
Advertisement

SV Ranga Rao : టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత గొప్ప నటుడు ఎస్వీ రంగారావు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎస్వీ రంగారావు చిన్నవయసులోనే మరణించారు. దీనికి కారణం ఆయనకున్న చెడు అలవాట్లే అని అంటుంటారు. ఇలాంటి అలవాట్లకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా దూరంగా ఉన్నారు. ఎక్కడ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అందుకే వారు తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు. కానీ కొందరు మహానటులు మాత్రం కొంతవరకు పరిమితమై ఉన్నారు. వారికి ఉన్న అలవాట్లలో వారు పిచ్చిగా వ్యవహరించి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

Advertisement

sv ranga rao love with her after marriage

ఏది అలవాటు చేసుకుంటే దానిని వారు అతిగా ప్రేమించి డబ్బు, కాలం వృధా చేసుకొని చివరికి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నారు. ఇలానే ఎస్వీ రంగారావు చెడు అలవాట్లకు బానిసై చిన్న వయసులోనే ప్రాణాలను వదిలేశారు. అప్పటికే చేతినిండా అవకాశాలు ఉన్నాయి. కానీ పెళ్లయిన తర్వాత ఒక ఆవిడను ప్రేమించడం ఆమె మాయలో పడి కెరీర్ దెబ్బ తీసుకున్నాడు. అలాగే విదేశీ మిత్రులతో కలిసి వ్యసనాలకు బానిస అయ్యాడు. తాగకపోతే నటించలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇలా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని ఆయన మిత్రులు ఇప్పటికీ చెబుతుంటారు.

Advertisement

ఈ అలవాట్లకు ఆయన దూరంగా ఉండి ఉంటే మరో వంద సినిమాలలో ఆయన నటించి ఉండేవారని చెబుతుంటారు. ఎస్వీ రంగారావు చాలా గొప్ప నటుడు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో సమానంగా నటించగలరు. నిజానికి ఎస్విఆర్ కు ఆ చెడు అలవాట్లు లేకపోయి ఉంటే ఆయన కూడా వారిద్దరితో సమానమైన పేరు ప్రఖ్యాతలు దక్కించుకునేవారు. కానీ ఆయన చెడు అలవాట్ల వల్ల జీవితాన్ని త్వరగా ముగించేసుకున్నాడు. ఇలా చాలామంది సినీ ఇండస్ట్రీలో చెడు అలవాట్లకు బానిసై చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి