swapna fires on jwala for being close with Prem and nirupam in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల కాదు. సోమవారం ప్రసారం అవుతుంది. 18 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 1329 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల ఓవర్ యాక్షన్ చూసి స్వప్నకు చాలా చిరాకు వస్తుంది. మరోవైపు డాక్టర్ సాబ్ మీరు కూడా ఫోటోలు తీస్తారా అని అడుగుతుంది జ్వాల. దీంతో తీస్తాను కానీ.. దాన్ని ఎక్స్ రే అంటారు అంటాడు. మరోవైపు అందరూ సంతోషంగా ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. ఇంతలో ప్రముఖ పారిశ్రామికవేత్త జయలలిత వచ్చి ఒక ఫోటోను చూసి ఆ ఫోటో తనకు బాగా నచ్చిందని చెబుతుంది. ఈ ఫోటోను నేను కొనుక్కుంటాను అని చెబుతుంది. దీంతో ప్రేమ్ సంతోషిస్తాడు.
swapna fires on jwala for being close with Prem and nirupam in karthika deepam
దాని విలువ రూ.1,30,000 అయినప్పటికీ.. తను మాత్రం 3 లక్షలకు తీసుకుంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. జ్వాల కూడా ఈ బొమ్మను అంత డబ్బు పెట్టి తీసుకుందా అనుకుంటుంది. ఆ తర్వాత నీ ఫోటోగ్రఫీని ఎవరు ఎంకరేజ్ చేశారు అని జయలలిత.. ప్రేమ్ ను అడుగుతుంది. దీంతో ఆ క్రెడిట్ మొత్తం మా డాడీదే అంటాడు ప్రేమ్. దీంతో స్వప్న షాక్ అవుతుంది. మై డాడ్ ఈజ్ మై హీరో. మా నాన్నే నా హీరో. నాన్నదే ఈ క్రెడిట్ అంతా అంటాడు ప్రేమ్. చూశావా మమ్మీ.. తమ్ముడి గొప్పదనం.. డాడీ మంచితనం. మమ్మీ.. నీ దగ్గర ఉంటేనే గొప్ప వాడిని అయ్యేవాడిని అన్నావు కదా.. ఇప్పుడు ఏమంటావు. ఇది డాడీ అంటే అంటాడు ప్రేమ్.
ఆ తర్వాత ప్రేమ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఫోటో దిగుతుంది జయలలిత. కట్ చేస్తే రవ్వ ఇడ్లీ తనకు ఎవ్వరూ లేరని బాధపడతాడు. దుర్గన్న ఏదో ఫంక్షన్ కు వెళ్తున్నాను అని చెప్పేసరికి.. తనకూ ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటాడు రవ్వ ఇడ్లీ.
మరోవైపు హిమ కోసం ఓ గిఫ్ట్ ను ప్యాక్ చేసి తనకు ఇవ్వాలని అనుకుంటాడు ప్రేమ్. ఇంతలో జ్వాల వచ్చి దాన్ని లాక్కుంటుంది. దీంతో ప్రేమ్ టెన్షన్ పడతాడు. ప్రేమ్ తో జ్వాల గొడవ పడుతుండటం చూసి స్వప్నకు కోపం వస్తుంది. వెంటనే కిందికి రాబోతుంది.
ఇంతలో హిమ వస్తుంది. ఆ తర్వాత నిరుపమ్ వచ్చి తనను లోపలికి తీసుకెళ్తాడు. తన కళ్ల ముందే జ్వాల చేయి పట్టుకొని నిరుపమ్ లోపలికి తీసుకెళ్లడం చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత సత్యంను తీసుకొచ్చింది జ్వాలే అని తెలుసుకుంటుంది స్వప్న.
దీంతో తనకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో ఎవరికో ఫోన్ చేసి ఏదో చెబుతుంది. మరోవైపు ఇంటికి వెళ్లపోయేందుకు రెడీ అవుతారు జ్వాల, సత్యం. చూశారా సార్.. మీ కొడుకును ఎలా అందరూ పొగిడారో అంటుంది జ్వాల.
ఇంతలో స్వప్న వస్తుంది. మీ అబ్బాయి సంతోషంగా ఉన్నాడు కదా.. అందరూ కలిశారు కదా అంటే నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు అంటుంది స్వప్న. స్థాయి ఏంటి మేడమ్ స్థాయి అంటూ జ్వాల.. స్వప్నపై సీరియస్ అవుతుంది. దీంతో స్వప్నకు ఇంకా కోపం వస్తుంది.
ఆటో నడిపేదానివి నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అని అంటుంది. స్వప్న ఏంటి గొడవ.. జ్వాల చేసిన తప్పేంటి అని అంటాడు సత్యం. దీంతో ఎవరో అనామకురాలు వండి పెడితే తింటున్నారు.. మీతో నాకేంటి అంటుంది స్వప్న. దీంతో హలో మేడమ్ మీరు వండిపెడితే మేము వండే పరిస్థితి ఉండదు కదా అంటుంది జ్వాల.
దీంతో తనపై చేయి చేసుకోబోతుంది స్వప్న. ఇంతలో నిరుపమ్ వచ్చి స్వప్న చేయి పట్టుకుంటాడు. మీరందరూ ఇచ్చిన చనువు వల్లే ఇది అలా రెచ్చిపోతోంది అంటుంది స్వప్న. ఏంటి డాక్టర్ సాబ్ నేను ఏం తప్పు చేశాను అంటుంది జ్వాల.
ఆటో ఆటో అంటున్నారు. ఆటో అంటే అంత చులకనా అంటుంది జ్వాల. దీంతో ఏయ్ ఎక్కువ మాట్లాడకు. నా సంగతి నీకు తెలియదు అంటుంది స్వప్న. దీంతో జ్వాలకు భయపడటం తెలియదు అంటుంది జ్వాల. ఏం చేస్తారు అంటూ బెదిరిస్తుంది స్వప్నను.
దీంతో ఏం చేస్తానా అని చెప్పి బయటికి వెళ్లి జ్వాల ఆటోను కాల్చేస్తుంది స్వప్న. దీంతో జ్వాలకు చాలా బాధేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో జ్వాలకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.