Home » Entertainment » Taapsee All Other Heroines Are Shocked By Her Attempt In New Movie
Entertainment

Taapsee : తాప్సీ కి ఉన్న తెగువ చూస్తే హీరోయిన్స్ అందరూ గగ్గోలు పెడతారు ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: February 3, 2021, 7:00 am
Advertisement

Taapsee : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమా కథాంశాలు చాలా భిన్నంగా ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి సినిమాలని చేయడం లో.. నిర్మించడంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పంథానే వేరు. ఈ క్రమంలో పాడ్ మాన్ లాంటి సినిమా తో పాటు ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ చేసిన సినిమాలే ఉదాహరణ. కాగా ఇప్పుడు అలాంటి సినిమాలోనే తన ప్రతిభ చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది సొట్టబుగ్గల బ్యూటి తాప్సి.

Advertisement

తాప్సీ ఝుమ్మందినాదం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి తన సత్తా చాటుకుంది. గ్లామరస్ పాత్రలతో పాటు విభిన్న పాత్రలను చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ వస్తుంది తాప్సీ. బాలీవుడ్ లో ‘పింక్’ ‘తప్పడ్’ బద్లా సినిమాలలో తాప్సీ టాలెంట్ ఏంటో సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు నార్త్ లోనూ రుజువైంది. కాగా ఇప్పుడు అలాంటి కొత్త కథాంశం తో మరోసారి తాప్సీ మన ముందుకు రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ‘లూప్ లాపెటా’ అనేది 1998లో విడుదలైన జర్మన్ సూపర్ హిట్ క్లాసిక్ ‘రన్ లోలా రన్’ మూవీ అఫీషియల్ రీమేక్.

Taapsee : అలాంటి సీన్స్ చేసేందుకు ఒప్పుకోవడానికి గట్స్ కావాలి..!

Advertisement

‘లూప్ లాపెటా’ అనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చూసి అందరు షాక్ కి గురౌవుతున్నారు. సినిమాలలో నటీ, నటులు బాత్రూమ్ సీన్స్ చేయడం మాములే అయినా ఒక టాప్ పొజిషన్ లో ఉండి కూడా అలాంటి సీన్స్ చేసేందుకు ఒప్పుకోవడానికి గట్స్ కావాలి. తాప్సీ చీకటిగా ఉన్న బాత్రూమ్ లో మురికితో కూడిన టాయిలెట్ లో కూర్చొని చేతిలో పేపర్ ముక్క పట్టుకొని ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్న లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో ఉంది తాప్సీ. ఈ క్రమంలోనే మరోసారి ఛాలెంజిగ్ రోల్ లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ పోస్టర్ కి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా ఇంగ్లీష్ లో టామ్ టైకర్ దర్శకత్వం వహించగా.. ప్రస్తుతం రీమేక్ మూవీకి ఆకాష్ భాటియా డైరెక్టర్. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్ ఆయుష్ మహేశ్వరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి