Taapsee Pannu : సొట్ట బుగ్గల సుందరి తాప్సీ తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయం అయింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ నుండి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని సొంతం చేసుకుంది. గ్లామర్ కంటే నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగుతున్న తాప్సీ వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ అశేష ప్రేక్షకదారణ పొందుతుంది.
వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతున్నారు తాప్సీ. మరోవైపు.. హీరోయిన్‌గా చేస్తూనే.. ప్రొడ్యూసర్‌గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఆమె నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకేట్’ చిత్రంకోసం తాప్సీచాలా కష్టపడింది. ప్రతి సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెడుతుంటుంది. తాజాగా తాప్సి నటించిన చిత్రం ‘లూప్ లపేట’. ఇది 1998లో తెరకెక్కిన జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’ అనే చిత్రానికి రీమేక్. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తాప్సి ఓ చేదు అనుభవం ఎదుర్కొంది.ఇందులో ముద్దు సన్నివేశం ఉండగా, అందులో జీవించేందుకు డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అందించారు.
తాప్సి, నటుడు తాహిర్ మధ్య రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశం సమయంలో మీ చేతులని ఒకరినొకరు హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ముద్దు పెట్టుకోండి. ఆ ముద్దు ఎలా ఉండాలంటే ఒకరికొకరు స్విచ్ ఆన్ చేసినట్లుగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఆకాష్ కామెంట్స్ శృతి మించాయి. తాహిర్ ఇలాంటి అమ్మాయిని ఇంతకు ముందెప్పుడూ నువ్వు చూడలేదు. ఇలాంటి అమ్మాయితో ఇలాంటి ఛాన్స్ ఎప్పుడూ నీకు దక్కలేదు.. కిస్ చెయ్’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. అప్పుడు నాకు చిరాకు వచ్చి ఆపేశాను. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ గట్టిగా ప్రశ్నించాను. అతని మాటలు చాలా బాధించాయి. తర్వాత పూర్తి చేసాను అనుకోవడి అంటూ తాప్సీ ఆ సంఘటనల గురించి వివరిచింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.