పవన్ కళ్యాణ్ తో జీవితాంతం చెప్పుకునే సినిమా మిస్ అయిన టాలెంటెడ్ డైరెక్టర్ ..!

Authored By vamana sai | The Telugu News | Published on: January 6, 2021, 2:00 pm

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దర్శకులు.. నిర్మాతలు.. హీరోలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొంతమంది నటులకైతే ఒక్క సీన్ లో అయినా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే చాలనుకుంటారు. వీళ్ళే కాదు దర్శక, నిర్మాతలు కూడా కెరీర్ మొత్తం లో పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేయాలని ఏళ్ళగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా జీవితాంతం నిలిచిపోతుంది. ఈ విషయంలో పదేళ్ళుగా కల కంటున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా నిర్మించి ఆ కల నెరవేర్చుకున్నాడు.

Pawan Kalyan | Dil Raju | Pawan Kalyan New Movie | Pawan Kalyan Next Movie  | Pawan Kalyan Films | Pawan Kalyan Dil Raju | - Filmibeat

ఈ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. వాస్తవంగా సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి తర్వాత సినిమా చేయాల్సింది. అది కూడా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన తేరీ అన్న సినిమా. ఈ సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కూడా. పవన్ కళ్యాణ్ – సంతోష్ శ్రీనివాస్ మధ్య చర్చలు జరిగాయి. ఇక ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఎందుకనో ఈ సినిమాని మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు.

Another Director Gives Up Hopes On Pawan Kalyan - ManaTeluguMovies.net

ఇప్పటికే పవన్ కళ్యాణ్ 6 సినిమాలని కమిటయి ఉన్నాడు. అవన్ని పూర్తవ్వాలంటే ఖచ్చితంగా 2022 దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ – సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే సంవత్సరం పైనే సమయం పడుతుందంటున్నారు. ఇక దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతోంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇంకా ఈ దర్శకుడు వెల్లడించలేదు.

vamana sai

No bio available for this author.

  1. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  2. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  3. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  4. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  5. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  6. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

  7. "Ys Jagan : 2024 ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందా? సీఈసీ ముందు జగన్ అండ్ టీమ్ భారీ నిరసన..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp