Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. జై లవకుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇక కెరీర్ పరంగా తమన్నా లైఫ్ మూడు పూలు ఆరు కాయలన్నట్లుంది. తెలుగులో ఆమె మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. చిరంజీవి కి జంటగా భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. అలాగే ఎఫ్ 3 మూవీలో వెంకటేష్ తో మరోసారి జతకడుతున్నారు.
యంగ్ హీరో సత్య దేవ్ లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం మూవీ చేస్తున్నారు. బోలే చుడియన్, ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ అనే మూడు హిందీ చిత్రాలు చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూసిన తమన్నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందంటుంది. ఇటీవల ఆమె పెళ్లికి సంబంధించి తెగ వార్తలు రాగా, వాటిని ఖండించింది. ఈ అమ్మడు హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.
తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రం మే 27న విడుదల కానుంది. ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలతో తెగ బిజీ అయింది. ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ షో 200 వ ఎపిసోడ్ కి ఎఫ్3 టీమ్ హాజరైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. ఎఫ్ 2 కి ఇది సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ వరుణ్ కి జోడిగా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. క్యాష్ ప్రోగ్రాంలో తమన్నా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడమే కాకుండా ప్రోమో చివర్లో ఎమోషనల్ గా మారింది. తమన్నా కంటతడి పెట్టుకుంటూ దృశ్యాలు అనిపిస్తున్నాయి. దీనితో అక్కడ అందరి కళ్ళల్లో విషాదం కనిపిస్తోంది. తమన్నా ఎందుకు కన్నీరు పెట్టుకుంటోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.