Thammareddy – Nagababu : ఆర్ఆర్ఆర్ సినిమా వివాదం ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసమే ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని.. ఆ బడ్జెట్ తో ఏకంగా 10 సినిమాలు తీయొచ్చని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.
తమ్మారెడ్డి వ్యాఖ్యలను వాళ్లు ఖండించారు. తెలుగు సినిమా ఖ్యాతి ప్రస్తుతం ఖండాంతరాలు దాటింది. కానీ.. మన ఇండస్ట్రీని మనమే తక్కువ చేసుకుంటున్నాం అంటూ బాగానే తమ్మారెడ్డిని ఏకిపారేశారు. నాగబాబు అయితే.. నీ బతుకెంత.. నువ్వెంత అన్న రేంజ్ లో తమ్మారెడ్డిపై ఫైర్ అవడంతో తమ్మారెడ్డి వెంటనే నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు. ఆవేశంతో ఊగిపోతూ నాగబాబును బండబూతులు తిట్టారు.
అసలు నేను ఏం తప్పు చేశానని సారీ చెప్పాలి. నేను చెప్పనను. ఫిలిం ఫెస్టివల్ లో చిన్న దర్శకులతో చర్చిస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు అవి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు తీయాలని అనుకోకండి.. అవి తీయడం కష్టం.. నమ్మిన సినిమాలు తీయండి అని చిన్న దర్శకులకు చెప్పానున. అందులో తప్పేముంది. ఆర్ఆర్ఆర్ ఒక గొప్ప సినిమా అని రెండు రోజుల ముందే మాట్లాడాను. దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు ఎందుకు. రాజమౌళిని చూసి నేనెందుకు జెలసీ ఫీల్ అవుతాను. నేను ఆయనకు కాంపిటీటర్ నా. నేను కృష్ణా, రామా అనుకుంటూ బతుకుతున్నా. ఎవరో కామెంట్స్ చేస్తే నేను పట్టించుకునే వాడిని కాదు.
కానీ.. ఇండస్ట్రీ వాళ్లే ఇలా మాట్లాడటం నాకు బాధనిపించింది. నా అమ్మ మొగుడు అంటూ మాట్లాడారు. నాకు నీతిగా బతకడం నేర్పించాడు ఆయన. మీకు నేర్పించారా? మీకు నిజం తెలుసా? మీరు చేసినవేంటో నేను చెప్పాలా? నా గురించి మాట్లాడే హక్కు మీకుందా? నేను మాట్లాడిన మూడు గంటల వీడియోను చూడకుండా.. కేవలం ఒక క్లిప్ చూసి ట్వీట్ చేస్తే సరిపోయిందా? నన్ను తిట్టిన వారికే సిగ్గుండాలి. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే అది వాళ్ల మొహం మీదే పడుతుంది అని గ్రహించుకోవాలి అని తమ్మారెడ్డి సీరియస్ అయ్యారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.