Hari Hara Veera Mallu : తెలంగాణ‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీమియ‌ర్ షోస్‌కి గ్రీన్ సిగ్న‌ల్.. టిక్కెట్ల రేట్లు పెరుగుద‌ల‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hari Hara Veera Mallu : తెలంగాణ‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీమియ‌ర్ షోస్‌కి గ్రీన్ సిగ్న‌ల్.. టిక్కెట్ల రేట్లు పెరుగుద‌ల‌

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Hari Hara Veera Mallu : తెలంగాణ‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీమియ‌ర్ షోస్‌కి గ్రీన్ సిగ్న‌ల్.. టిక్కెట్ల రేట్లు పెరుగుద‌ల‌

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్ గా విడుదల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 23న ప్రత్యేక బెనిఫిట్ షోలకు కూడా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం, టికెట్ ధరలు పెంపునకు ఓకే చెప్పింది.

Hari Hara Veera Mallu తెలంగాణ‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీమియ‌ర్ షోస్‌కి గ్రీన్ సిగ్న‌ల్ టిక్కెట్ల రేట్లు పెరుగుద‌ల‌

Hari Hara Veera Mallu : తెలంగాణ‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీమియ‌ర్ షోస్‌కి గ్రీన్ సిగ్న‌ల్.. టిక్కెట్ల రేట్లు పెరుగుద‌ల‌

Hari Hara Veera Mallu : అనుమ‌తులు వ‌చ్చాయి..

ప్రిమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ధారిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా జూలై 24 నుంచి 27 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది.మొదటి రోజు నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాగే జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 వరకు అదనంగా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో బెనిఫిట్ షోలను రద్దు చేసినప్పటికీ, హరిహర వీరమల్లు కోసం మళ్లీ అనుమతి లభించడం విశేషం. జూలై 23న, విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. ఈ షోకు ఒక్క టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అదేవిధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. 10 రోజులపాటు మాత్ర‌మే ఈ ధ‌ర‌లు అమల్లో ఉండనున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది