Home » Entertainment » Thaman Copies The Music From Krack
Entertainment

Thaman : థ‌మ‌న్ ఎందుకిలా కాపీ చేస్తున్నాడు.. మ‌ళ్లీ దొరికిపోయాడుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 15, 2022, 8:00 am
Advertisement

Thaman : ప్ర‌స్తుతం టాలీవుడ్ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో థ‌మ‌న్ ఒక‌రు. ఆయ‌న ఇటీవ‌లి కాలంలో ప‌లువురు స్టార్ హీరోల సినిమాల‌కి మ్యూజిక్ అందించ‌గా, అవి సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. బాక్స్‌లు బ‌ద్ద‌ల‌య్యేలా మ్యూజిక్ కొడుతున్న థ‌మ‌న్ కొన్ని సార్లు త‌న పాట‌ల‌ని తానే కాపీ చేసుకుంటూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. స‌ర్కారు వారి పాట సినిమాలో మహేష్ పేరుతో మ మ మహేషా అంటూ సాగుతున్న ఆ సాంగ్ మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా థ‌మ‌న్ వేరే వాళ్ల పాటలు చూసి కాపీ కొట్టాడు అంటూ ఆరోపణలు వచ్చాయి కానీ ఆ త‌ర్వాత ఆయన తన సొంత ట్యూన్ ను మళ్ళీ కాపీ చేశాడు అంటూ ప్రచారం జరిగింది.

Advertisement

మ మ మహేష్ అనే సాంగ్ గతంలో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమా టైటిల్ సాంగ్ లాగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ట్యూన్ కూడా కొంచెం దగ్గరగా ఉండడంతో ఇంకేముంది, థ‌మ‌న్ ఈ పాటను కూడా కాపీ కొట్టేశాడు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేసారు. అయితే థ‌మ‌న్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అధికభాగం హిట్లు అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు.తాజాగా చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

thaman copies the music from krack

Advertisement

Thaman : కాపీ క్యాట్..

రీసెంట్‌గా చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ”తార్ మార్ తక్కర్ మార్” ప్రోమో విడుదల చేశారు. ఈ సాంగ్ లో సూపర్ స్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. పూర్తి సాంగ్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఇక తక్కర్ మార్ సాంగ్ ట్యూన్ విన్న నెటిజెన్స్ ఇది కాపీ అంటున్నారు. క్రాక్ సినిమాలో ఓ పాటకు థమన్ ఇచ్చిన ట్యూన్ మరలా గాడ్ ఫాదర్ కోసం వాడేశారు అంటున్నారు. క్రాక్, గాడ్ ఫాదర్ చిత్రాలకు థమన్ ఇచ్చిన ఈ ట్యూన్ కొంచెం దగ్గరగా ఉంది. థమన్ ని ట్యాగ్ చేస్తూ నెటిజెన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మ‌రి దీనిపై థ‌మ‌న్ ఏమైన స్పందిస్తాడా అన్న‌ది చూడాలి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి