vakeel saab : వకీల్ సాబ్ హైలెట్స్ ఇవే .. హిందీ .. తమిళం కంటే భారీ హిట్ కొట్టబోతున్న పవన్ కళ్యాణ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

vakeel saab : వకీల్ సాబ్ లో హైలెట్స్ ఇవే .. హిందీ .. తమిళం కంటే భారీ హిట్ కొట్టబోతున్న పవన్ కళ్యాణ్ ..!

vakeel saab సినిమా గురించే ఇప్పుడు ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. వకీల్ సాబ్ స్ట్రైట్ సినిమా కాకపోవడం తోనే రక రకాల చర్చలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ వకీల్ సాబ్ తో ఇవ్వడం కరెక్టేనా అన్న పెద్ద సందేహం చాలామందిలో ఉంది. అందరికీ తెలిసిన కథ.. మరి ఈ కథ తెలుగు ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది.. ఎంతవరకు మెప్పిస్తుంది అంటే ఒకటే సమధానం.. […]

 Authored By govind | The Telugu News | Updated on :16 January 2021,1:26 pm

vakeel saab సినిమా గురించే ఇప్పుడు ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. వకీల్ సాబ్ స్ట్రైట్ సినిమా కాకపోవడం తోనే రక రకాల చర్చలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ వకీల్ సాబ్ తో ఇవ్వడం కరెక్టేనా అన్న పెద్ద సందేహం చాలామందిలో ఉంది. అందరికీ తెలిసిన కథ.. మరి ఈ కథ తెలుగు ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది.. ఎంతవరకు మెప్పిస్తుంది అంటే ఒకటే సమధానం.. కథ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మెస్మరైజ్ చేస్తాడని.

ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ని లాయర్ గా చూడాలనుకున్న ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులకి వకీల్ సాబ్ ఆ సరదా తీర్చేస్తుండనడంలో సందేహం లేదు. అయితే ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ తోటి .. కోలీవుడ్ హీరో అజిత్ తోటి పోలికలు పెట్టడం మాత్రం పక్కా. ఈ క్రమంలో వకీల్ సాబ్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న విషయంలో ఒక న్యూస్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ గా నటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల తన లాయర్ వృత్తిని పక్కన పెట్టేస్తాడట.

అయితే ముగ్గురు అమ్మాయిలకి అన్యాయం జరడం చూసి తట్టుకోలేక మళ్ళీ కోటు వేసుకొని కోర్టులో ప్రత్యక్ష్యమై ఒక్కొక్కరి భరతం పడతాడని తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ సినిమాలో హైలెట్ గా నిలిచేసి క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్స్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందట. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ ల మీద సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి హిందీ .. తమిళం కంటే తెలుగులో ఈ కథ బాగా సక్సస్ సాధిస్తుందని అంటున్నారు.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది