Samantha : సమంత అదృష్టవంతురాలు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్న మాట ఇదే. అందుకు కారణం సమంత లాంటి పక్కా కమర్షియల్ హీరోయిన్ కి శాకుంతలం లాంటి పౌరాణిక సినిమాలో అవకాశం దక్కడమే. కొన్ని రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరగాల్సిందే. అదే ఇప్పుడు సమంత కెరీర్ లో జరుగుతోంది. ఏం మాయ చేశావే సినిమాకి దర్శకుడు గౌతం మీనన్ దాదాపు 70 మంది మోడల్స్ ని పరిశీలించాడట. అయినా ఆయన రాసుకున్న జెస్సీ దొరకలేదు. అయినా కాంప్రామైజ్ కాలేదు. జల్లెడ పడుతూనే ఉన్నాడు. ఆ సమయంలో సమంత గౌతం మీనన్ కంట్లో పడింది.
ఆయన రాసుకున్న జెస్సీ కళ్ళ ముందు కనబడగానే ఏమాత్రం ఆలోచించలేదు. ఒక్క ఆడిషన్ తర్వాత ఏ మాయ చేశావే సినిమాకి హీరోయిన్ గా ఓకే చేసింది. వాస్తవంగా డెబ్యూ సినిమా ఇంత రొమాంటిక్ గా చేయలంటే ఇంకొకరైతే వెనకడుగు వేసే వారు. ఆ తర్వాత కూడా ఇలాంటి సినిమాలే వస్తాయని నో చెప్పే వారు. కాని జెస్సీ ఇక్కడే డేరింగ్ డెసిషన్ తీసుకుంది. అదే ఈరోజు 50 సినిమాల మైల్ స్టోన్ వద్దకి చేర్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని, నాగ చైతన్య, నాగార్జున, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నితిన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ తో పాటు.. కోలీవుడ్ లో విజయ్, సూర్య, ధనుష్ లాంటి వారితో సూపర్ హిట్ సినిమాలు చేసింది.
ఇప్పటి వరకు పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన సమంత కాస్త గ్లామర్ టచ్ ఉన్న రోల్ లో కూడా మెప్పించింది. అక్కినేని వారికి కోడలయ్యాక గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటున్న సమంత మజిలీ, ఓ బేబి, జాను లాంటి సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే జాను డిజాస్టర్ తర్వాత సమంత సినిమా ప్రకటించకపోవడంతో ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి కొంత కాలం రెస్ట్ తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది. కానీ శాకుంతలం ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇలాంటి కథ లో చేయాలన్న కోరిక సమంతకి కొన్నేళ్ళ నుంచి ఉన్నప్పటి ఆ అవకాశం ఇప్పుడు వరించింది. అది కూడా గుణశేఖర్ వంటి గొప్ప దర్శకుడి తెరకెక్కించబోతున్న సినిమాలో. ఈ అవకాశం రాగానే సమంత.. ఇక జీవితానికి ఏం కావాలి అన్న ఆనందంలో మునిగిపోయిందట. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన శాకుంతలం త్వరలో సెట్స్ మీదకి రాబోతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.