Actors : రోజు రోజుకి దిగజారుతున్న హీరోల వాల్యూ.. అవే కొంపముంచుతున్నాయా..!
Actors : ఈ మధ్య హీరోలు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తే, మరికొందరు జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఇంకొందరు కోర్టు మెట్లు ఎక్కారు. తమకు సంబంధం లేకుండా వివాదాల్లో చిచ్చుకున్న సెలబ్రిటీలు, Social Media సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు అతి ప్రమోషన్స్, పీఆర్ స్టంట్స్, ఓవర్ హైప్, ఫేక్ కలెక్షన్స్, కార్పొరేట్ బుకింగ్స్, పెయిడ్ కాంపెయిన్స్, ఇంటర్నేషనల్ పొలిటికల్ కామెంట్స్, ఫ్యాన్ వార్. వీటి వలన హీరోల ప్రతిష్ట రోజు రోజుకి తగ్గుతూ పోతుంది. వీటికి తొందరగా చెక్ పడకపోతే వారి ప్రతిష్ట మరింత దిగజారే అవకాశం ఉంది.
Actors : రోజు రోజుకి దిగజారుతున్న హీరోల వాల్యూ.. అవే కొంపముంచుతున్నాయా..!
ఈ మధ్య కాలంలో ‘మంచు’ ఫ్యామిలీ ఫైట్ హాట్ టాపిక్ అయింది. కొడుకు మనోజ్ మీద మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తన తండ్రి వ్యక్తిగత సిబ్బంది మీద కొడుకు కేసు పెట్టారు. Manchi Manoj మనోజ్ ను ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఓ బహిరంగ సందేశాన్ని విడుదల చేసారు. తాను ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానని మనోజ్ అంటున్నారు. ఇన్నాళ్లు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఫ్యామిలీలో విభేదాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ – నయనతారల మధ్య నెలకొన్న వివాదం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది.నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనతో పదకొండేళ్లు సహజీవనం చేసి, నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. జానీ తనను లైగికంగా వేధించాడంటూ ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఓ యువతి కేసు పెట్టింది. Allu Arjun అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తర్వాత సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఫ్యాన్స్, అల్లు ఆర్మీ మధ్య ఓ రేంజ్ లో ఘర్షణలు జరిగాయి. ‘పుష్ప 2’ విడుదల తర్వాత అంతా సద్దుమణిగింది. ఐఫా అవార్డ్స్ హోస్టింగ్ కారణంగా టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి – తేజా సజ్జ లపై కొన్ని రోజులపాటు ట్రోలింగ్ జరిగింది. ఈవెంట్ లో భాగంగా తెలుగు సినిమాలను రోస్టింగ్ చేసే క్రమంలో వీరిద్దరూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడమే దీనికి కారణం. అయితే దీనిపై తేజ, రానాలు క్లారిటీ ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని వివరణ ఇచ్చారు. కానీ వీరిద్దరూ ‘మిస్టర్ బచ్చన్’ ను ట్రోల్ చేయడంపై దర్శకుడు హరీష్ శంకర్ హర్ట్ అయ్యారు. ఇలా పలు కారణాలతో హీరోల ప్రతిష్ట దెబ్బ తింటుంది.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.