Home » Entertainment » Those Three Heroines Hopes Are On Raviteja
Entertainment

Raviteja : రవితేజ మీదే ముగ్గురు హీరోయిన్స్ నమ్మకాలు.. ఆశలు..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: April 19, 2021 10:12 pm
Advertisement

Raviteja : రవితేజ మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చాడు. ఈ మూడేళ్ళు నుంచి వరసగా సినిమాలైతే చేశాడు గానీ.. ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టర్ సాధించి రవితేజ అకౌంట్‌లో చేరలేకపోయింది. ఎట్టకేలకి గోపీచంద్ మలినేని క్రాక్ రూపంలో రవితేజకి సాలీడ్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన శృతి హాసన్‌కి కూడా మూడేళ్ళ తర్వాత లైఫ్ వచ్చింది. రవితేజ క్రాక్ సినిమాకి శృతి హాసన్‌ని తీసుకొని సక్సస్ ట్రాక్ ఎక్కించాడు. దాంతో ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ రవితేజ మీద బోలెడన్ని నమ్మకాలు ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

those three heroines hopes are on raviteja

రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరో అర్జున్, హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ కీలక పాత్రల్లో నటిస్తుండగా మే 28న రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Raviteja : రవితేజ ఈ ముగ్గురికి లైఫ్ ఇస్తాడా లేదా..?

ఈ సినిమాలో నటిస్తున్న మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి ఖిలాడి సక్సస్ మీదే నమ్మకాలు పెట్టుకున్నారు. మీనాక్షీ చౌదరి ఇప్పటికే ఒక సినిమా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక డింపుల్ హయాతి..వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్టు సాంగ్‌లో మెరిసింది. హీరోయిన్‌గా ఖిలాడి మొదటి సినిమా. కాగా రవితేజ ఉగాది రోజున కొత్త సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాకి శరత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మజిలీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దివ్యాంశ కౌశిక్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. మజిలీ సూపర్ హిట్ అయినా దివ్యాంశ కౌశిక్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. అందుకే ఈ బ్యూటీ కూడా రవితేజ మీదే నమ్మకాలు పెట్టుకుంది. మరి ఈ ముగ్గురికి రవితేజ లైఫ్ ఇస్తాడా లేదా చూడాలి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి