Tillu Square Movie : టిల్లు స్వ్కేర్.. Tillu Square Movie ఇప్పుడు ఎక్కడ విన్నా సరే ఇదే మాట వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత సమ్మర్ కు సరైన జోష్ వచ్చింది. ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే డీజేటిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేసింది. అందులో సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగులు యూత్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. దాంతో సిద్దు కాస్త స్టార్ బాయ్ సిద్దుగా siddu jonnalagadda మారిపోయాడు. ఇక దానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగాయి.
పైగా అనుపమ పరమేశ్వరన్ anupama parameswaran హీరోయిన్ గా చేయడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. విడుదలైన టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే అనుపమ అంతకు ముందు ఎప్పుడూ లిప్ లాక్ లాంటి సీన్లు చేయలేదు. కానీ ఈ సినిమాలో ఏకంగా లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయింది. అందుకే ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. ఇక శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. తొలిరోజే రూ.23 కోట్లకు పైగా వసూలు చేయగా.. డే 2 కలెక్షన్స్ లో రెండు రోజుల్లోనే బడ్జెట్ మొత్తం రాబట్టేసింది.
రెండు రోజుల్లో కలిపి ఏకంగా రూ.48 కోట్ల మేర వసూలు చేసిన టిల్లు స్క్వేర్ ఆదివారం నాడు కూడా అదరకొట్టింది. మూడో రోజు ఆదివారం సెలవుదినం కావడంతో మరింత కలిసి వచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. దాంతో మూడు రోజుల్లోనే రూ. 68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సెంచరీ దిశగా దూసుకుపోతుంది టిల్లు స్క్వేర్. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్, టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో సమ్మర్ సెలవులు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చేఛాన్స్ ఉందని అంటున్నారు. పైగా ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా లేవు.
కాబట్టి ఇంకో మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగులు అందరికీ బాగా నచ్చేశాయి. అందుకే మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాంతో పాటు ఇందులో నేహాశెట్టి కనిపించడం కొసమెరుపు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.