Ambati Rambabu : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారికి వైయస్ జగన్ టికెట్ రాకుండా చేశారని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే గత కొంతకాలంగా ఈ వార్తలు పై ఆంధ్ర రాష్ట్రంలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైసీపీ నాయకుడు అంబాటి రాంబాబు ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబటి రాంబాబును ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఓ ప్రశ్న అడగడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ రఘురామకృష్ణం రాజు గారికి జగన్ టికెట్ రాకుండా చేశారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
దీనిపై మీ స్పందన ఏంటని అడగడం జరిగింది. ఇక ఈ ప్రశ్నకు అంబాటి రాంబాబు సమాధానం ఇస్తూ….ఇన్మూరల్ గా పనిచేసే వ్యక్తిని ఎప్పుడూ ఎవరూ కూడా నమ్మరని తెలియజేశారు. ఎందుకు ఇన్మూరల్ అంటున్నాను అంటే…నువ్వు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచావు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను తిడతాను అంటాడు. చివరికి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని అంబటి రాంబాబు తెలియజేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీతో మాట్లాడి ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేశారని అంటున్నారు. అసలు ఇదేం ఆరోపణ. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని సైతం ఇన్ఫ్లెన్స్ చేయగలరని చెబుతున్నారా.
చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఫ్లెన్స్ చేసి ఉండొచ్చు కదా అంటూ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు జగన్ గారా చంద్రబాబు గారా అని అడిగారు. దీనికి అంబటి రాంబాబు సమాధానం ఇస్తూ ఇతను వైసీపీలో గెలిచి వైసీపీ పార్టీని తిడుతున్నారు కదా రేపు బీజెపీ పార్టీలో గెలిచి బీజెపీని కూడా తిడతాడేమో అని అధిష్టానమే అతనికి టికెట్ ఇవ్వలేదు అనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు.ఇది ఇలా ఉండగా రఘురామకృష్ణ రాజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నామినేషన్ టికెట్ దక్కించుకోలేక 2014లో వైసీపీ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం 2019 మార్చిలో వైసీపీ పార్టీలోకి మళ్ళీ తిరిగి చేరారు. ఇక 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.