Actor Brahmaji : నటుడు బ్రహ్మాజీకి ఏమైంది?.. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

 Authored By prabhas | The Telugu News | Updated on :26 June 2022,1:30 pm

Actor Brahmaji : నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కమెడియన్‌గా, విలన్, ఎమోషనల్ పాత్రల్లో ఇలా తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతగానో మెప్పించేశాడు బ్రహ్మాజీ. కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎదుగుదామని ట్రై చేశాడు.కానీ చివరకు కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ తరానికి మాత్రం బ్రహ్మాజీ అంటే ఆల్ టైం ఫేవరేట్ కమెడియన్‌గా మారిపోయాడు. ఆయన నటిస్తున్న సినిమాలు,వేస్తోన్న పాత్రలు కడుపుబ్బా నవ్వించేస్తున్నాయి. అయితే బ్రహ్మాజీ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ తెగ నవ్వించేస్తుంటాడు.

ఒక్కోసారి ఆయన వేసే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ఆ మధ్య హైద్రాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు వేసిన ట్వీట్ కాంట్రవర్సీకి దారి తీసింది. నాకు పడవలు కావాలి.. అంటూ వరదల మీద సెటైర్లు వేయడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇక కరోనా సమయంలో బ్రహ్మాజీ వేసిన పోస్టులు అందరినీ నవ్వించాయి. డబ్బుల్లేవ్.. పూట కూడా గడవడం లేదంటూ చిప్ప చేతిలో పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అలా బ్రహ్మాజీ నిత్యం నెటిజన్లను అలరిస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు బ్రహ్మాజీ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. అందుకే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tollywood Actor Ands Comedian Brahmaji Quits From Instagram

Tollywood Actor Ands Comedian Brahmaji Quits From Instagram

కారణాలేంటో సరిగ్గా తెలియడం లేదు గానీ బ్రహ్మాజీ వేసిన ఈ పోస్ట్ మాత్రం అందరినీ ఆలోచనలో పడేసింది. బ్రేకింగ్ న్యూస్ అంటూ.. ఓ పోస్ట్ వేశాడు. ఇన్ స్టాగ్రాం నుంచి కొన్ని రోజుల పాటు వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఇంత సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఏమైనా చేదు అనుభవం ఎదురైందా? లేదా ఇంకేమైనా జరిగిందా? అని అందరూ అనుకుంటున్నారు. మరి బ్రహ్మాజీ ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదు. మళ్లీ ఇన్ స్టాలోకి ఎప్పుడు వస్తాడో కూడా చెప్పలేదు. అయితే లోలోపల మాత్రం ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తోంది.అసలే బ్రహ్మాజీ తన కొడుకు సంజయ్‌ని హీరోగా నిలబెట్టేందుకు బాగానే ట్రై చేస్తున్నాడు. ఓ పిట్ట కథ సినిమా అంటూ సంజయ్‌కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి