Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి కట్టుగా కనిపించి తెగ సందడి చేస్తుంటారు. మల్టీ స్టారర్ సినిమాలు పెరిగాక.. ఒకరిద్దరు కలుస్తున్నారు. కానీ.. సినిమా పంక్షన్లలో మినహా బయట మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఒకే చోట కనిపించడం చాలా రేర్. అయితే.. రీసెంట్‌గా చిరంజీవి,రామ్ చరణ్, నాగార్జున,మహేష్ బాబు, అఖిల్ అంతా ఒకే చోట కలిసి కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వీరు ఎవరు ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లో పాల్గొన్నారు? పార్టీ ఎక్కడ జరిగింది? అన్న వాటిపై చర్చ జరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు మరి కొందరితో ఓ హోటల్‌లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండటం ఆ ఫోటోలో కనిపిస్తుంది.
అయితే, మాల్దీవులు వేదికగా ఓ వ్యాపార వేత్త తన పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ట్రీట్‌కు వీరంతా హాజరయ్యారని సమాచారం.నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు ఇలా మాల్దీవుల్లో రిలాక్స్ అవుతూ కనిపించడంతో ఎంజాయ్ చేయడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్‌లో చిరంజీవి అనే చిత్రం చేస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట.. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.అక్కినేని నాగార్జున మాత్రం.. ఇటీవల మల్టీ స్టారర్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో నాగార్జున ఒక గెస్ట్ రోల్ చేస్తుండగా.. రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా వస్తున్న కుబేరలోనూ ఒక చిన్న క్యారెక్టర్‌ని నాగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. గుంటూరు కారంతో ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సూపర్ స్టార్.. రాజమౌళి సినిమా కోసం ఏ ప్రాజెక్ట్‌నీ ఓకే చేయలేదు. దాంతో మళ్లీ తెరపై మహేష్ బాబుని చూడాలంటే కనీసం 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అఖిల్ అక్కినేని ఈమధ్య తన సినిమాల గురించి అప్‌డేట్స్ ఇవ్వలేదు. కానీ.. ఏదో పీరియాడిక్ మూవీ కోసం మేకోవర్ అయినట్లు కనిపిస్తోంది. ‘లెనిన్’ టైటిల్‌తో ఒక సినిమా రాబోతోందని ఇటీవల వార్తలు రాగా.. యూవీ క్రియేషన్స్‌లో ‘ధీర’ అనే టైటిల్‌తో ఒక సినిమాని అఖిల్ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్‌కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.