tollywood cinema ticket rates reduced
Tollywood : కరోనా వలన సినిమా పరిశ్రమ దిక్కు తోచని స్థితిలో ఉంది. ఈ మహమ్మారి వలన సినిమా షూటింగ్స్ స్తంభించాయి. థియేటర్స్ మూతపడ్డాయి. ఎంతో మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని అందరు భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ సినీ రంగంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. కొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. మరోవైపు సినిమా టిక్కెట్ వ్యవహారం కూడా ఇండస్ట్రీకి ఇబ్బందిగా మారింది.
ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచాలని టికెట్ల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని పలువురు సీనీ ప్రముఖులు కోరుతున్న సంగతి తెలిసిందే. అక్కడ అలా ఉంటే తెలంగాణలో ప్రభుత్వం ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు రూ.300 నుండి రూ.350 చేరుకున్నాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో రాధేశ్యామ్ మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున బంగార్రాజు సినిమాతో పాటు పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి.మల్టీ ప్లెక్స్‌లలో అంత ధరలతో చిన్న సినిమాలను చూసే పరిస్థితి లేదు.
tollywood cinema ticket rates reduced
ఈ క్రమంలో ప్రేక్షకులను థియేటర్‌లకు తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లు టిక్కెట్ ధరలను సవరించాయి. తాజా సమాచారం ప్రకారం థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకి థియేటర్స్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్,డీజే టిల్లు, సూపర్ మచ్చి, హీరో వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఏ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి.
Ayurvedic Plant : ఆయుర్వేదంలో ఎన్నో మూలికలు ఉన్నాయి. అలాంటి మూలికే సంజీవని బూటీ మూలిక.దీనినే లక్ష్మణ్ బూటి అని…
Health Benefits : గులాబీ పువ్వులను తలలో ధరిస్తారు. ఇంకా పూజకి వినియోగిస్తారు. అలంకరణలలో వాడుతారు. అంతేకాకుండా, అవే కాకుండా…
Brahma kamalam : సాధారణంగా మనీ ప్లాంట్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ధనం వస్తుందని భావిస్తారు. కానీ అంతకుమించి అదృష్టాన్ని…
Mango : మామిడి పండ్ల సీజన్ వచ్చిందని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా...కొంత మంది ఉదయం ఎక్కువగా తింటే, మరి…
AC : భార్యాభర్తల మధ్య సామాజిక జీవితంలో ఫిజికల్ టచ్ చాలా ముఖ్యం. అది తగ్గితే, ఎమోషనల్ కనెక్షన్ కూడా…
Rafale-M Fighter Jets : భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు రాఫెల్-M యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం…
Harish Rao : బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ (BRS Silver Jubilee Sabha) నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.…
Bomb Blast : భారతదేశం పహల్గామ్ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే, పాకిస్తాన్లో మరో భారీ బాంబు పేలుడు కలకలం…
This website uses cookies.