Senior NTR : నాతో సినిమా చేయండి బ్రదర్.. నో అంటూ సీనియర్ ఎన్టీఆర్ ఆఫర్ ను తిరస్కరించిన స్టార్ డైరెక్టర్?
Senior NTR : సీనియర్ ఎన్టీఆర్.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్రను సృష్టించారు. తెలుగు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనకు విశ్వవిఖ్యాత నటుడనే బిరుదు కూడా ఇచ్చారు తెలుగు ప్రజలు. సీనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో ఉన్నప్పుడు.. ఆయనతో నటించాలని.. ఆయనతో సినిమా తీయాలని అనుకోని వారు ఉండరు. ఆయనతో ఒక్క షాట్ లో అయినా నటించినా చాలు అని అనుకునే నటులూ ఉండేవారు. హీరోయిన్లు కూడా ఒక్క సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా చేయాలని కలలు కనేవారు.

tollywood director kodanda rami reddy rejected senior ntr offer
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కు అప్పట్లో ఉన్న క్రేజ్ అటువంటిది. అందుకే ఎన్టీఆర్ నుంచి తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వాళ్లు బోలెడు మంది ఉన్నారు. అయితే.. ఒకసారి ఓ స్టార్ డైరెక్టర్ ను పిలిచి.. సీనియర్ ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారట. తనతో సినిమా చేయాలని చెప్పారట సీనియర్ ఎన్టీఆర్. కానీ.. ఆ డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ ఆఫర్ కు నో చెప్పాడట.సీనియర్ ఎన్టీఆర్ ఆఫర్ ను అప్పట్లో ఎవ్వరూ తిరస్కరించలేదు కానీ.. ఒక్క ఆ డైరెక్టర్ మాత్రం ఆయన ఆఫర్ కు నో చెప్పారు. ఆ డైరెక్టరే టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి. అప్పట్లో కోదండరామిరెడ్డి.. వరుస హిట్లతో జోరుమీదున్నారు.
Senior NTR : ఎన్టీఆర్ ఆఫర్ ను తిరస్కరించిన మొదటి డైరెక్టర్ ఆయనే
అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఆయన పిలుపు వచ్చింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన గౌరవం అనే సినిమాను ఎన్టీఆర్ తెలుగులో తీయాలనుకున్నారు. దీంతో కోదండరామిరెడ్డిని ఇంటికి పిలిచి.. ఆయన డైరెక్షన్ లో సినిమా తీస్తున్నామని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారట ఎన్టీఆర్.

tollywood director kodanda rami reddy rejected senior ntr offer
కానీ.. అప్పటికే కోదండరామిరెడ్డి చాలా సినిమాలకు కమిట్ అవడం వల్ల.. నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు కూడా తీసుకొని ఉండటం వల్ల.. ఎన్టీఆర్ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పాల్సి వచ్చిందట. సీనియర్ ఎన్టీఆర్ సినిమాను చేయలేకపోయినందుకు కోదండరామిరెడ్డి చాలా బాధపడ్డాడట. సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయలేకపోయినా.. కనీసం తన కొడుకు బాలకృష్ణతో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించాడు కోదండరామిరెడ్డి.