TollyWood : బ్రేకింగ్.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు, వదలని ఈడీ…!
TollyWood : టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తుంది. ఈ కేసుకి సంబంధించి సినీ ప్రముఖులకు క్లీని చిట్ లభించినా సరే ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసే అవకాశం కనపడటం లేదు. దీనికి సంబంధించి ఆర్ధిక లావాదేవీల మీద ఎక్కువగా జాతీయ దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేసాయి.
తాజాగా ఈడీ మరోసారి రంగంలోకి దిగి తెలంగాణా ఎక్సైజ్ శాఖకు ఒక లేఖ రాసింది. డ్రగ్స్ కేసు వివరాలను తమకు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. నిందితులు అలాగే సాక్షుల వాంగ్మూలాలతో పాటుగా కాల్ డేటా అదే విధంగా డిజిటల్ రికార్డులను తమకు అందించాలని లేఖలో ప్రస్తావించింది.

TollyWood ed letter writes to telangana excise department about drugs case
ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్ట్ లో పలు కీలక అంశాలను ఈడీ తరుపు న్యాయవాదులు ప్రస్తావించారు. కేసుకి సంబంధించి వివరాలను, డాక్యుమెంట్ లను ఇవ్వడం లేదని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న కోర్ట్ కేసుకి సంబంధించి రికార్డులను ఈడీ అధికారులకు అందించాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్ట్ ఆదేశాల నేపధ్యంలో ఈడీ రాసిన ఈ లేఖ హాట్ టాపిక్ అయింది.