How to impress girls simple relati0nship Love tips
Tollywood : పరిశ్రమ ఏదైనా కూడా కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్గా కొనసాగుతోంది. అది సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా ఉంటుందని.. చాలా ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. అవకాశాల కోసం ఎక్కడి నుంచో వస్తారు. అవకాశాలు రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లడానికి వారికి మనసు రాదు. దాంతో ఇండస్ట్రీ లోనే ఏదో ఒకటి చేసి ఉండాలని కొందరు భావిస్తారు. అలా హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారిలో కొందరు అవకాశాలు రాకపోవడంతో అడ్డ దారిలో అయినా అవకాశాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో మనసు చంపుకొని తమ అవసరం కోసం చేయకూడని పనులు కూడా చేస్తుంటారని గతంలో పలు సంఘటనలు చెప్పకనే చెప్పాయి.
సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన అమ్మాయిలపై కొందరు ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటి వారు అమ్మాయిలను పట్టుకొని సినిమా ఆఫర్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అలాంటి సంఘటనలు చాలా జరిగినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. కానీ మరి కొందరు మాత్రం ఆ విషయంలో జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పకుండా తమలోనే మదనపడుతూ చివరకు ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇటీవల ఒక హీరోయిన్ (ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటించింది) మరిన్ని ఆఫర్ల కోసం ఎదురు చూస్తోందట.
Tollywood heroine cheated by a man with movie offers
ఆమెకు ఆఫర్లు ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడట. నిర్మాతలకు అతడు సన్నిహితుడు అవ్వడం వల్ల సినిమా ఆఫర్లు ఇప్పిస్తాడు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తికి సదరు హీరోయిన్ దగ్గర అయిందట. అతడు ప్రేమిస్తున్నానని సినిమాలో ఛాన్స్ ఇస్తానని నమ్మబలికి శారీరకంగా కూడా దగ్గరై.. సినిమాలో ఆఫర్ పేరుతో విచ్చలవిడిగా ఆమెతో గడిపిన అతను ఇప్పుడు ముఖం చాటేశాడట. తనను అతడు మోసం చేశాడంటూ ఆ హీరోయిన్ ఇప్పుడు కన్నీరుమున్నీరవుతోంది. అయినా కూడా ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలని భావించడం లేదట. స్నేహితులు సలహా ఇచ్చినా కూడా ఆమె మాత్రం పోలీసుల వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నదట. అతడిపై కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ సన్నిహితుల వద్ద ఆ హీరోయిన్ వ్యాఖ్యలు చేస్తుందట. ఎంతో మంది హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నా కూడా అవకాశాల పేరుతో జరుగుతున్న మోసాలు మాత్రం ఆగడం లేదు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.