JR NTR : బ్రహ్మాస్త్ర కోసం చిరంజీవి రావాల్సింది.. చివరి నిమిషంలో ఎన్టీఆర్ రాబోతున్నాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : బ్రహ్మాస్త్ర కోసం చిరంజీవి రావాల్సింది.. చివరి నిమిషంలో ఎన్టీఆర్ రాబోతున్నాడు

JR NTR : బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ హీరోగా అయాన్ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 విడుదలకు సిద్ధమయింది. వచ్చే నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు సంబంధించిన తెలుగు పంపిణీ హడావుడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. భారీ ఎత్తున ప్రమోషన్ చేయడంతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,6:20 pm

JR NTR : బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ హీరోగా అయాన్ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 విడుదలకు సిద్ధమయింది. వచ్చే నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు సంబంధించిన తెలుగు పంపిణీ హడావుడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. భారీ ఎత్తున ప్రమోషన్ చేయడంతో పాటు సినిమా పై ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. కనుక తప్పకుండా బ్రహ్మాస్త్ర తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

ఈ సమయంలోనే బ్రహ్మాస్త్ర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు, ఆయన వాయిస్ ఇచ్చాడు కనుక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆయన సమర్పించిన లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఆయనను పక్కకు పెట్టాలని ఉద్దేశంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి దూరం పెట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రావాల్సిన ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారని సమాచారం అందుతుంది.

tollywood JR NTR for bollywood brahmastra movie pre release event

tollywood JR NTR for bollywood brahmastra movie pre release event

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆయన రావడం వెనక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఉన్నాడంటూ సమాచారం అందుతుంది. రాజమౌళి మరియు ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం ద్వారా ఖచ్చితంగా బ్రహ్మాస్త్ర సినిమా కు తెలుగులో విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం, తద్వారా మొదటి రెండు మూడు రోజులు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే తప్పకుండా మరిన్ని వసూళ్లు నమోదయ్య అవకాశం ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది