Home » Entertainment » Tollywood Movies Budget Audience Mindset Changed
Entertainment

Tollywood : ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది బాబాయ్.. సినిమాల బడ్జెట్ తగ్గించుకోకుంటే నష్టాలే…?

Authored By
vamana sai
The Telugu News | Published on: June 12, 2022, 5:00 pm
Advertisement

Tollywood : కరోనాకు ముందు అంటే 2020 కంటే ముందు ఉన్న మైండ్ సెట్ ప్రేక్షకుల్లో సినిమాల పరంగా ఇప్పుడు లేదని స్పష్ఠంగా తెలుస్తోంది. దీనికి నిదర్శనం ఇటీవల కాలంలో వచ్చిన చిన్న, మీడియం, భారీ బడ్జెట్ చిత్రాలే. ముఖ్యంగా భారీగా నష్టాలను చూస్తుంది మాత్రం భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించిన నిర్మాతలే. 2022లో ఇప్పటివరకు చూసుకుంటే మన టాలీవుడ్‌లో లాభాల శాతం చాలా తక్కువనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని మేకర్స్ చెప్పారు. కనైఇ, మరీ అంత భారీ లాభాలు రాలేదనేది ఇన్స్‌సైడ్ టాక్. అయితే, రిలీజ్ ముందు వరకూ బాగా టెన్షన్ పడ్డ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాతో నష్టాలను చూసింది లేదనే చెప్పొచ్చు. కాస్తో కూస్తో అందరికీ లాభం చేకూరింది. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ సినిమాకు దాదాపు 4 కోట్ల వరకూ నష్టాలు వచ్చినట్టు వార్తలు వినిపించాయి.

Advertisement

వాస్తవంగా ఈ సినిమాకు మంచి లాభాలే రావాల్సింది. కానీ, అదనంగా 40 రోజుల షూటింగ్ కోసం బడ్జెట్ ఎక్కువవడం అలాగే, ఏపీలో టికెట్ ఇష్యూ వల్ల ఈ నష్టం వచ్చింది. లేదంటే నిర్మాతకు లాభాలే దక్కేవి. ఇక పెద్ద సినిమాగా వచ్చిన రాధే శ్యామ్ పరిస్థితి మరీ ఘోరం అని చెప్పాలి. నాలుగేళ్ళ నుంచి ఈ సినిమా ప్రొడక్షన్‌లో ఇంది. కరోనా దెబ్బ దారుణంగా తగిలింది అంటే ఈ సినిమాకే. ఎంత లేదన్నా 100 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టాలు చూశారని టాక్. ఇప్పుడిది ప్రభాస్ సినిమాల మీద బాగానే ఎఫెక్ట్ చూపిస్తుందనీ అంటున్నారు. చిన్న పాయింట్..అది కూడా ప్రభాస్ లాంటి హీరో చేయాల్సింది కాదు. ఇలాంటి సినిమాకు 250 కోట్ల మేర బడ్జెట్ పెట్టడం అంటే నిర్మాతలు ఎలా ధైర్యం చేశారో మరి. ఇక మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలు నష్టాలనే చూశాయి.

Tollywood Movies Budget Audience Mindset Changed

Advertisement

Tollywood : ప్రభాస్ లాంటి హీరో చేయాల్సింది కాదు.

వీటిలో ముఖ్యంగా ఆచార్య సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మాంచి సక్సెస్ ట్రాక్‌లో కొరటాల దర్శకుడు కావడం ఆర్ఆర్ఆర్ తర్వాత చిరు సినిమాలో చరణ్ కూడా నటించడంతో భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కథ లేకపోతే సినిమాను ఎవరూ చూడరనడానికి ఇటీవల బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆచార్య. ఇదే కాదు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు ఫ్లాపయ్యాయి. మహేశ్ సర్కారు వారి పాట ఫైనల్‌గా నష్టాలతోనే ముగిసింది. దాదాపు 15 కోట్ల వరకు ఈ సినిమాకు లాస్ వచ్చిందట. మనవాళ్ళు సినిమా బావున్నా ఇప్పుడు థియేటర్స్‌కు వెళ్ళేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి ఉదాహరణ ఎఫ్ 3. ఎటూ నెలా రెండు నెలల్లో ఓటీటీలో వచ్చేస్తుందని లైట్ తీసుకుంటున్నారు. మరి ఇలా జనాల మైండ్ సెట్ మారినప్పుడు వీలైనంతవరకు సినిమాల బడ్జెట్ తగ్గించుకుంటే మంచిదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి