tollywood movies win at small screen
Tollywood Movies : సాధారణంగా ఏ సినిమా విడుదలైన కూడా ఆ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకంతో నిర్మాతలు చిత్రాన్ని విడుద లచేస్తుంటారు. కాని ఒక్కోసారి అంచనాలు తప్పడంతో మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ మూటగట్టుకుంటుంది. కథని అర్ధం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు.థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటగా చూస్తే ఖలేజా. ఖలేజా టైటిల్ మీద వివాదం వచ్చింది. చివరకు ఖలేజా సినిమాను మహేష్ ఖలేజాగా మార్చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ ఏంటి? అసలు మహేష్‌బాబు దేవుడా? కాదా? సినిమా నేపథ్యం ఏంటి? అసలేం జరుగుతోంది? అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. దీంతో గందరగోళంగా మారింది. కథలోని అసలు పాయింట్ చివర్లో ఎప్పుడో రివీల్ చేయడం,
మహేష్ బాబుని దేవుడిగా ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులకు అది నిజం కాదని తెలియడంతో అంతా నిరాశ చెందారు. దీంతో ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఓడినా.. బుల్లితెరపై గెలిచింది. ఇక నేనింతే . రవితేజ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ ఈ చిత్రం తెరకెక్కించారు. పరిశ్రమలోని కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే స్క్రీన్‌ప్లే కాస్త బెడిసి కొట్టడంతో మూవీ ఫ్లాప్ అయింది. బుల్లితెరపై అలరించింది. ఇక విదేశాలలో చదువుకోవాలుకునే కొందరు కుర్రాళ్ల మధ్య సాగే సరదా సన్నివేశాలతో వెన్నెల చిత్రం రూపొందింది. ఈ సినిమాతో కిషోర్ వెన్నెల కిషోర్ గా మారాడు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా నడిచిన కూడా చిత్రం ఎందుకో బెడిసి కొట్టింది. నాగార్జు గగనం చిత్రం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కగా, ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాలోని ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎందుకో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన వినూత్న కథా చిత్రం ఐతే.
tollywood movies win at small screen
ప్రతి సన్నివేశం సహజంగా ఉండడంతో పాటు యువతని ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఎందుకో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రాజశేఖర్ నటించిన ఓంకారమ్ సినిమా 1997 లో ఉపేంద్ర డైరెక్షన్ లో రాగా, ఈ సినిమా కథ బాగున్నప్పటికీ ఆడియన్స్ కి అర్ధం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది. రామ్ చరణ్, జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమాని జనం అర్ధం చేసుకోలేకపోయారు.నిజానికి ఈ కథలో డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంటుంది.కానీ జనం దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చాలా బాగుంటుంది.ప్రేమలో ఓడిపోయామని ఆగిపోకూడదు, జీవితంలో సర్వం కోల్పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కగా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాని ప్రేక్షకులని అలరించలేకపోయింది. ఆ నలుగురు ,వేదం, ప్రస్థానం, శ్రీహరి బ్రోకర్, నేను మీకు తెలుసా, అందాల రాక్షసి, కొమరం పులి, వన్ నేనొక్కడినే, అర్జున్ ఇలా థియేటర్ లో పెద్దగా ఆడక, బుల్లితెర మీద ఆడిన, ఆడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.