Chiranjeevi : ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి వైపు.. సమ్మె పై ఆయన స్పందన ఏంటో!
Chiranjeevi : టాలీవుడ్ లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ సమస్యల్లో కొన్ని వాటంతట అవే పరిష్కారం అవుతూ ఉంటే మరి కొన్ని మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ కి పెద్దలు అయిన వారు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరు లేరు అనేది కొందరి అభిప్రాయం కాగా.. కొందరు మాత్రం ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతా సాపీగా సాగుతుంది అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా ఇండస్ట్రీకి చెందిన అన్ని క్రాప్ట్ ల వర్కింగ్ ఎంప్లాయిస్ తమ రెమ్యూనరేషన్ పెంచాలంటూ డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.
నేటి నుండి షూటింగ్ లకు హాజరు కాబోము అంటూ వారు చేసిన ప్రకటన ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల వారిలో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది. దాంతో భారీగా టికెట్ల రేట్లు పెంచితే థియేటర్లకు జనాలు రావడం లేదు. ఈ సమయంలో ఎంప్లాయిస్ రెమ్యూనరేషన్ లు పెంచడం వల్ల నిర్మాతలకు మరింత భారం అవుతుంది. అప్పుడు టికెట్ల రేట్లు పెంచినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఇండస్ట్రీ కష్టాలు ఎదుర్కొంటూ ఉంది అంటే ఇది మరో పెద్ద సమస్యగా దాపరించింది అంటూ ఒక ప్రముఖ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ సమయంలో అందరు కూడా మెగాస్టార్ చిరంజీవి వైపు చూస్తున్నారు. గతంలో చిరంజీవి ఇలాంటి సమస్యల పరిస్కారం కు ముందడుగు వేసి టాలీవుడ్ కు తాను ఉన్నాను అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇండస్ట్రీ పెద్దగా ఖచ్చితంగా చిరంజీవి ఎంప్లాయిస్ యూనియన్ తో మాట్లాడితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయిస్ యూనియన్ కూడా చిరంజీవి తో మాట్లాడేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఆయన ఈ విషయమై అసలు ఎలా స్పందిస్తాడు చూడాలి. చిరంజీవి నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అర్థాంతరంగా ఆగిపోయాయి. దాంతో ఆయన రంగంలోకి దిగి చర్చలు జరిపే అవకాశాలు పుష్కకలంగా ఉన్నాయి. మరి ఈ సమస్యకు ఆయన ఎలాంటి పరిష్కారం ను చూపిస్తాడు అనేది చూడాలి.