Balakrishna : తెల్లారితే బాలకృష్ణ మీద పడి ఏడ్చే ప్రతీ మెగా ఫ్యాన్ చదవాల్సిన న్యూస్ ఇది !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 18, 2023, 11:30 am

Balakrishna : సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు కానీ.. అందరూ రియల్ హీరోలు కాదు. వాళ్లు కేవలం రీల్ హీరోలు అంతే. కానీ.. కొందరు మాత్రం సినిమాల్లోనే కాదు.. రియల్ గానూ హీరోలుగానే ఉంటారు. కొందరు తాము రియల్ గా హీరోలం అని చెప్పుకోరు. వాళ్లు చేసే సేవా కార్యక్రమాల గురించి ఎవ్వరికీ తెలియనివ్వరు. అలాంటి వాళ్లలో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో చాలామంది పేదవారికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల క్యాన్సర్ కు గురైన ఒక అమ్మాయికి తన సొంత డబ్బుతో వైద్యం చేయించారు. ఇటీవల.. అన్ స్టాపబుల్ షోలో ఈ విషయాన్ని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తాను హోస్ట్ గా చేస్తున్న ఆ షోకు ప్రభాస్, గోపీచంద్ వచ్చారు. ఆ షోలోనే ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అయింది. ఆ షోకు వచ్చి బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పింది ఆ అమ్మాయి. ఆమెను వేదిక మీదికి ఆహ్వానించి కాసేపు మాట్లాడి తనకు ధైర్యం చెప్పి పంపించారు బాలకృష్ణ. చాలామంది బాలకృష్ణ గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు.

tollywood senior hero balakrishna has shown his greatness

tollywood senior hero balakrishna has shown his greatness

Balakrishna : ఆపదలో ఉన్నవారి గురించి తెలుసుకొని మరీ స్పందించే బాలయ్య

కానీ.. బాలకృష్ణ అలా కాదు.. అది ఆయనలోని ఒక కోణం మాత్రమే. ఆయన ఆపదలో ఉన్నవారి గురించి తెలుసుకొని స్పందిస్తుంటారు. వాళ్లకు ఆర్థికంగా అండగా ఉంటారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇటీవల ఓ యువతికి బోన్ క్యాన్సర్ రావడంతో ట్రీట్ మెంట్ కోసం రూ.10 లక్షలు వెంటనే సాయంగా అందించారు. ఆ యువతికి ట్రీట్ మెంట్ చేయించే డాక్టర్లతోనూ మాట్లాడి వెంటనే ట్రీట్ మెంట్ చేయించారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న బాలయ్య బాబు అభిమానులు శెభాష్ అంటూ బాలకృష్ణను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp