Telugu Movies following the same trend Stories of kings
Tollywood : హాలీవుడ్ బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు… విడాకులు చాలా కామన్ గా మారాయి. చాలా ఏళ్ళ క్రితం నుండి అక్కడ ప్రేమ వివాహాలు మరియు విడాకుల గురించి మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కానీ సౌత్లో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎక్కువ శాతం విడాకులు తీసుకునేందుకు ఇష్టపడరు. ఒకసారి పెళ్లి కి ఫిక్స్ అయిన తర్వాత కచ్చితంగా జీవితాంతం కలిసి ఉండాలని భావిస్తూ ఉంటారు.విడాకులు తీసుకుంటే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో కొందరు జీవిత భాగస్వామి గా చేసుకున్న వారిని ఏదో విధంగా భరించాల్సిందే అని కొందరు తెలుగు వారు విడాకులు అంటే ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా విడాకులు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.తర్వాత పలువురు సినీ ప్రముఖులు విడాకుల గురించి నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు కూడా పలు జంటలు కూడా విడాకులు తీసుకున్నట్లు గా ప్రకటించి సంచలనం సృష్టించారు. ముందు ముందు పరిస్థితులు బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి దిగజారుతాయని అనిపిస్తుంది. తాజాగా మరో టాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది.ఆయన టాలీవుడ్లోనే స్టార్ దర్శకుడు. పెళ్లి అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వారి మధ్య గొడవలు వస్తున్నాయని ఆ గొడవల కారణంగా కలిసి ఉండాలనే ఉద్దేశం లేకపోవడంతో విడిపోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చారట.
tollywood star director couple going to divorce
ఇండస్ట్రీకి చెందిన వారు మరియు వారి కుటుంబ పెద్దలు వారిని కలిసి ఉండేలా చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయట. కానీ ఏ ఒక్కరు కూడా వారిని ఒప్పించలేక పోయారు.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు పెద్దవారయ్యారు. పిల్లలు వారి వారి భవిష్యత్తు లో వారు సెటిల్ అవుతారనే నమ్మకంతో ఈ భార్య భర్తలు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. విడాకులు తీసుకునేందుకు గాను ఇప్పటికే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ కు వచ్చారని.. త్వరలోనే కోర్టులో విడాకుల సంబంధించిన ప్రాసెస్ ని మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ స్టార్ దర్శకుడు ఎవరు.. ఎందుకు విడాకులు తీసుకుంటున్నాడు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.