Tollywood stars : టాలీవుడ్ ..బాలీవుడ్..కోలీవుడ్..ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ..హీరోలు గానీ..హీరోయిన్లు గానీ పెద్ద పెద్ద రెస్ట్రారెంట్స్ కి వెళుతుండటం సహజం. 5 స్టార్స్ హోటల్స్ ని సందర్శిస్తుంటారు. చాలామంది ఫుడీస్ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. మంచి ఫుడ్ కనిపిస్తే నోరు కట్టేసుకుని కూర్చోవడం ఎవరి వల్లా కాదు. ఎంత పెద్ద స్టార్ అయినా భోజనం దగ్గరికి వచ్చేసరికి అన్నీ మర్చిపోయి కావాల్సినవన్నీ లాగించేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా మెనులో ఇవన్నీ ఉండాల్సిందే.
అలాంటి ఫుడ్ ఐటెంస్ ఏంటో ..మన టాలీవుడ్ స్టార్స్ విపరీతంగా ఇష్టపడే ఫుడ్స్ ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా సీ ఫుడ్ ని చిరు చాలా ఇష్టపడతారు. అలాగే బ్రేక్ ఫాస్ట్‌లో దోశ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక మన టాలీవుడ్ స్టార్ నటసింహం నందమూరి బాలకృష్ణ రొయ్యలను ఎంతో ఇష్టంతో తింటారు. చికెన్ బిర్యానీ కూడా బాలయ్య బాగా ఇష్టపడతారట. విక్టరీ వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఇష్టంగా తింటారు. వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాలజిక్ కీమాను తినడం వెంకటేష్ కు చాలా ఇష్టమని ఇంతక ముందు కూడా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.
ఇక టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారని స్వయంగా చెప్పిన సందర్భం ఉంది. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కి బిర్యానీ, సీ ఫుడ్, రోడ్ సైడ్ పానీపూరీ అంటే ఎంతో ఇష్టంగా తింటారని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు బిర్యానీ, చేపల పులుసును చాలా ఇష్టంగా తింటారు. అయితే ఏం తిన్నా డైటీషియన్ సలహాల ప్రకారమే. అందరికీ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వంటకాలు చాలానే ఉన్నాయి. పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసుతో పాటు నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టంగా తింటారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ యంగ్ హీరోకు నాన్నమ్మ చేసే వంటకాలు చాలా ఇష్టమని ..ఆవిడ చేసిన ఏ వంటకాన్నైనా అమితంగా తింటాడట. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో తనకు రోటీ, నాటుకోడి ఖీమా ఇష్టమని చెప్పారు. ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు స్వయంగా స్పైసీ మటన్ వండుకొని అందులో చపాతీ తినడం అంటే తారక్ కి బాగా ఇష్టం. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయట ఫుడ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడట. ఇంట్లోనే అమ్మ చేసే ఏ వంటకాన్నైనా ఇష్టపడతారని తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.