Tollywood Heroine : తెలుగు హీరోయిన్ కి అవకాశం ఇస్తా కాని బెడ్ రూమ్ కు రమన్నాడట!
Tollywood Heroine : ఆమె తెలుగు అమ్మాయి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించి స్టార్ గా పేరు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయిదు ఆరు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడుతూ ఇప్పుడిప్పుడే జనాల్లో కాస్త గుర్తింపును దక్కించుకుంటుంది. హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూ వెబ్ సిరీస్ ల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఒక వెబ్ సిరీస్ లో కాస్త బోల్డ్ గా ముద్దు సన్నివేశాల్లో ఈ అమ్మడు నటించడంతో టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలోనే ఈ అమ్మడికి రెండుమూడు సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. స్కిన్ షో తో పాటు రొమాంటిక్ సన్నివేశాలకు ఓకే చెప్పాలని డిమాండ్ చేశారట.
సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో ఉన్న ఆమె సినిమా కోసమే కదా అనుకుని స్కిన్ షో కు ఓకే చెప్పిందట. శృతి మించని రొమాంటిక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఒక నిర్మాణ సంస్థ నుండి ఆఫర్ వచ్చింది. కాస్త పేరున్న నిర్మాణ సంస్థ అవ్వడంతో కథ విషయంలో పేచీ పెట్టకుండా సినిమా చేయడానికి సిద్దం అయ్యాను. కాని వారు పెట్టిన కండీషన్స్ కు ఆ నిర్మాణ సంస్థ అంటేనే అసహ్యం పుట్టింది. తనను సంప్రదించిన వ్యక్తి పారితోషికం.. కథ ఇతర విషయాల గురించి మాట్లాడకుండా ఇండస్ట్రీలో మంచి పేరున్న మీడియా సంస్థ.

Tollywood Telugu Heroine facing problems with top producers costing couch
కాస్త సర్దుకు పోతే ఇండస్ట్రీలో సెట్ అవ్వచ్చు అన్నాడు. సర్దుకు పోవడం అంటే ఏంటో నాకు అర్థం అయ్యింది. షూటింగ్ సమయంలో బెడ్ రూం కు వెళ్లాల్సి ఉంటుందని నాకు అర్థం అయ్యింది. అతడి మాటాల్లో కూడా అది అర్థం అవుతుంది. సినిమా ల్లో రొమాంటిక్ గా నటించేందుకు ఓకే చెప్తే ఇలా బెడ్ రూం కు రమ్మంటారా అంటూ ఆ సమయంలోనే అతడిపై కోప్పడ్డాను. అతడు సైలెంట్ గా నీ ఇష్టం అంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు. ఆ ఆఫర్ కు కమిట్ అవ్వాలంటే నన్ను నేను వదులుకోవాలి.. అలా నన్ను నా ఆత్మాభిమానంను వదులుకోవాలి అనుకోవడం లేదు. అవకాశాలు లేకుంటే వెబ్ సిరీస్ ల్లో లేదా షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తాను. లేదంటే మోడలింగ్ చేస్తాను. అంతే తప్ప బెడ్ రూమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు అంది.