Dil Raju : దిల్ రాజు అనేది ఒక బ్రాండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఆయన సినిమాలు నిర్మించినా… డిస్ట్రిబ్యూట్ చేసినా ఆ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఆయన చేయి పెడితే సినిమా బంగారంగా మారినట్లే అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందా అంటే అవును అని చాలా మంది అంటున్నారు. దిల్ రాజు జడ్జిమెంట్ ఈ మధ్య కాలంలో తప్పుతోంది. ఆయన తీసుకున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతున్నాయి. పది సినిమాల్లో రెండు సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతుండగా మిగతా ఎనిమిది సినిమాలు నిరాశ పర్చుతున్నాయి.
దిల్ రాజు సినిమా అంటే ఒక బ్రాండ్ ఉన్న సినిమా అని ఒక మంచి సినిమా అని ఉన్న పేరు ఈ మధ్య కాలంలో తగ్గుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు బ్రాండ్ ఇమేజ్ మరింతగా దెబ్బ తినకుండానే ఆయన జాగ్రత్త పడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకప్పుడు దిల్ రాజు తన దిల్ తో సినిమా యొక్క తీరును జడ్జి చేసేవాడేమో కానీ ఇప్పుడు దిల్ రాజు యొక్క దిల్ పని చేయడం లేదని కొందరు.. ఆయన తన దిల్ ఎక్కడో పెట్టాడంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకే దిల్ రాజు తన దిల్ దగ్గర పెట్టుకొని ఇక ముందు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయాలని, అలాగే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన బ్యానర్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా వారసుడు అనే టైటిల్ తో తెలుగు మరియు తమిళంలో ఏక కాలంలో విడుదల కాబోతుంది. ఇక తెలుగులో రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇవి మాత్రమే కాకుండా వేణు టిల్లు దర్శకత్వంలో ఒక చిన్న సినిమాను నిర్మించాడు. అంతే కాకుండా మూడు నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరికొన్ని సినిమాల యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడు. మొత్తానికి దిల్ రాజు వరుసగా ప్లాప్స్ పడుతున్న కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. అందుకే ఆయన మళ్లీ మళ్లీ మంచి సినిమాలు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.