
trisha about after marriage relationship
Marriage : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అవుతుంది. అయినా సరే ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్ గా కూడా కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది త్రిష కృష్ణన్. కెరియర్ లో కొన్నాళ్లు వెనకపడ్డా సరే మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అయితే ఏజ్ బార్ అవుతున్న ఈ అమ్మడు పెళ్లి ఊసెత్తితే మాత్రం అప్పుడే పెళ్లేంటి అన్నట్టు మాట్లాడేస్తుంది. కొన్నేళ్ల క్రితం కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బిజినెస్ మెన్ వరుణ్ మణియన్ తో పెళ్లికి సిద్ధమైంది త్రిష. ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా చేసుకుంది.
అయితే పెళ్లి మాత్రం చేసుకోలేదు. త్రిష ఎందుకు ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఎప్పటినుంచో తెలిసిన వరుణ్ తో ఆమె వివాహం వద్దనుకుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం 39 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ఆలోచన లేదని అంటుంది త్రిష. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను కానీ ఎలాంటి వాడు భర్తగా రావాలో అని మాత్రం చెప్పేస్తుంది. పెళ్లిపై ఒక నమ్మకం ఉన్న త్రిష తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలని కబుర్లు చెబుతుంది. తన భర్త తనపై పూర్తి విశ్వాసంగా ఉండాలని అంటుంది. అంతేకాదు జీవితాంతం తోడుగా ఉంటాడనే నమ్మకం కలిగించాలని చెబుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ డైవర్స్ తీసుకోవడం..
trisha about after marriage relationship
మధ్యలో విడిపోవడం లాంటివి తనకు నచ్చవని అంటుంది త్రిష. శాశ్వతంగా తనతో ఉండే వాడిని పెళ్లి చేసుకుంటానని త్రిష తన మనసులోని మాట బయట పెట్టింది. దాదాపు అందరు అమ్మాయిల్లానే త్రిష కూడా భర్త అంటే తనకు మాత్రమే సొంతం అయ్యేలా.. తనతో లైవ్ లాంగ్ ఉండేలా ఉండాలని కోరుతుంది. మరి అలాంటి వాడు ఆమెకి ఎప్పుడు తారసపడతాడో చూడాలి. మ్యారేజ్ విషయంలో అది ఎరేంజెడ్ అయినా.. లవ్ అయినా పర్లేదని అంటుంది త్రిష. త్రిష మాటలను బట్టి చూస్తే అమ్మడు ఎవరితోనైనా ప్రేమలో ఉందా అన్న అనుమానం రాకమానదు. ఏది ఏమైనా ముదుగు భామ త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.