Mahesh Babu : మహేష్ బాబును మెప్పించలేకపోయిన త్రివిక్రమ్..? సెకండాఫ్ నచ్చలేదా..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 8, 2022, 5:30 pm

Mahesh Babu : సూపర్ స్టార్ కథ, మహేష్ బాబు స్క్రీన్ ప్లే విషయంలో అలాగే డైలాగుల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. మాస్ ఆడియన్స్ కోసం దర్శకుడు మాస్ యాంగిల్‌లో రాసిన డైలాగ్స్ కాస్త అభ్యంతరకరంగా ఉన్నా కూడా అలాంటి డైలాగులను చెప్పడానికి నిర్మొహమాటంగా నో చెప్పేస్తాడు.
ఇక సీన్స్ విషయంలో అయితే, అసలు కాంప్రమైజ్ కాడు. ఆ సీన్ బదులు వేరే సీన్ పెట్టమని చెప్పిన సందర్భాలూ చాలా ఉన్నాయి. దీనికి కారణం  మహేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్. అంతేకాదు, మహేశ్‌ను చాలా క్లీన్ హీరోగా చూస్తున్నారు.

అలాంటప్పుడు తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఒక్క డైలాగ్ ఉన్నా మహేశ్ సహించడు. అలాంటిది ఏకంగా సెకండాఫ్ సంతృప్తికరంగా లేకపోయినా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే అసలు అయ్యేపనే కాదు. వంశీ పైడిపల్లి సీమాను కూడా లైన్ నచ్చినా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ నరేషన్ నచ్చక వదులుకున్నాడు. ఇప్పుడు అలాంటి సమస్య త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ విషయంలో వచ్చినట్టు తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరిలోనే మహేష్ బాబు -త్రివిక్రమ్ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఓపెనింగ్ కార్యక్రమాలను కూడా జరుపుకుంది.

Trivikram could not impress Mahesh Babu

Trivikram could not impress Mahesh Babu

Trivikram : మహేశ్ చెప్పిన మార్పులు చేస్తూ సెకండాఫ్ కథపై వర్క్..!

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా ఫిక్సైయ్యాడు. అయితే, ఇటీవలే ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌కు ఫారిన్ ట్రిప్‌కు వెళ్ళాడు మహేశ్. అయితే, మహేష్ బాబుకి ఫైనల్ వెర్షన్ వినిపించడానికి వెళ్ళిన త్రివిక్రమ్ సెకండాఫ్
స్క్రిప్ట్‌తో మెప్పించలేకపోయినట్టు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు సెకండాఫ్ విషయంలో కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. ఇండియాకు వచ్చిన త్రివిక్రమ్  ప్రస్తుతం మహేష్ బాబు చెప్పిన మార్పులు చేస్తూ సెకండాఫ్ కథపై వర్క్ చేస్తున్నారట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో చూడాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వచ్చిన సంగతి తెల్సిందే.

vamana sai

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : టాప్ కంటెస్టెంట్లకు షాక్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?"

  2. "AP Telangana Weather Alert : తీరం దాటిన మురసు తుఫాన్‌.. ఏపీ, తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు!"

  3. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  4. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  5. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  6. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  7. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp