Trivikram plans for mega project
Trivikram : టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ రూమర్ మాత్రం నిజం అయితే బాక్సాఫీస్ షేక్ అయిపోవల్సిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో త్రివిక్రమ్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజగా మరోసారి ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ సినీ నిర్మాత ,డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారాయణ కుమార్తె.. జాన్వి నారంగ్ వివాహ మహోత్సవం ఫిలిమ్ నగర్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు.
జాన్వి, ఆదిత్య జంటను ఆశీర్వదించేందుకు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు వచ్చారు. పెళ్లి వేడుకలో మెగా బ్రదర్స్ ఇద్దరు ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వచ్చిన కాసేపటికే చిరు కూడా పెళ్లి ఫంక్షన్‌కు హాజరయ్యారు. దీంతో వేదిక అంతా ఒక్కసారిగా కలర్‌ఫుల్‌గా మారింది. చిరు వచ్చేటప్పటికీ అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే చిరు దగ్గరకు వెళ్లిపోయారు. అన్నను అప్యాయంగా పలకరించి గట్టిగా కౌగిలించుకున్నారు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ వేడుకకు డైరెక్టర్ త్రివిక్రమ్ తో వివాహానికి వచ్చారు పవన్ కళ్యాణ్. అయితే వీరిద్దరి కలయికపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది.ఈ ఇద్దరి కాంబినేషన్ లో మెగా ఫీస్ట్ రావడం ఖాయం అని అనుకుంటున్నారు.
Trivikram plans for mega project
అతి త్వరలోనే దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ కూడా రానుందని గాసిప్ రాయుళ్లు చెబుతున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందనేది. రాజకీయాల్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సోదరుడు చిరంజీవిని ముఖ్యమైన సందర్భాల్లోనే కలుస్తూ వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో బిజీగా ఉండగా, పవన్ కళ్యాణ్ ఓ రీమేక్ చిత్రంతో పాటు హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. అక్టోబర్ నుండి జనాలలోకి వెళ్లనున్న నేపథ్యంలో సినిమాలకి కాస్త బ్రేక్ రానుందని టాక్.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.