Trivikram Srinivas : త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తే హీరోల తండ్రులు చ‌నిపోతారా.. ఇదెక్క‌డి సెంటిమెంట్‌రా బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Trivikram Srinivas : త్రివిక్ర‌మ్‌తో సినిమా చేస్తే హీరోల తండ్రులు చ‌నిపోతారా.. ఇదెక్క‌డి సెంటిమెంట్‌రా బాబు..!

Trivikram Srinivas : మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న త్రివిక్ర‌మ్ ఈమధ్య కాలంలో స్పీడ్ త‌గ్గించారు అని చెప్పాలి. ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో “అల వైకుంఠపురములో” సినిమా చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో “భీమ్లానాయక్” కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 November 2022,11:40 am

Trivikram Srinivas : మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న త్రివిక్ర‌మ్ ఈమధ్య కాలంలో స్పీడ్ త‌గ్గించారు అని చెప్పాలి. ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో “అల వైకుంఠపురములో” సినిమా చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో “భీమ్లానాయక్” కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా మాత్ర‌మే పని చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్న కుద‌ర‌లేదు. మధ్యలో కారణాలు చెప్పకుండా సినిమాను చర్చల దశలోనే ఆపేసిన‌ట్టు స‌మాచారం.

చివ‌రికి మహేష్ తో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా షూటింగ్ వ‌డివ‌డిగా సాగ‌డం లేదు. మహేష్ తల్లి ఇందిరాదేవి అకాల మృతితో కొద్ది రోజులు సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ వాయిదా వేయాల్సి వ‌చ్చింది. మళ్లీ మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయ‌గా, యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చ‌నిపోవ‌డంతో ఈ మూవీ షూటింగ్‌కి కొన్నాళ్ల పాటు బ్రేక్ ప‌డ‌నుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నప్పుడే హీరోల తండ్రులు చనిపోతున్నారనే సెంటిమెంట్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Trivikram Srinivas sentiment news viral

Trivikram Srinivas sentiment news viral

Trivikram Srinivas : ఇదేం సెంటిమెంట్..!

పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకటరావు అనారోగ్యం కార‌ణంతో కన్నుమూశారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్న సమయంలో ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారని నెటిజ‌న్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మ‌హేష్‌తో సినిమా చేస్తుండ‌గా, కృష్ణ చ‌నిపోయారు. అలా పవన్ -కళ్యాణ్ తండ్రి వెంకట్రావు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ , మ‌హేష్ తండ్రి కృష్ణ … త్రివిక్ర‌మ్ సెంటిమెంట్‌తో చని పోయారని సదరు నెటిజన్ పేర్కొన్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది