Trolls On Chiranjeevi And Sreemukhi Interview Video
Chiranjeevi : మహేష్ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఒక సన్నివేశంలో ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్లుగా ఒక డైలాగు చెప్తాడు. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి మరియు శ్రీముఖి కాంబినేషన్ ఇంటర్వ్యూ కి తెగ వర్తిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ ఐదో తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవడం లేదు.. చిరంజీవి బయటకు రావడం లేదు.. సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అంటూ రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉన్నాను అంటూ ఒక చిన్న డైలాగులు వదిలి ప్రకంపనలు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అది సినిమాలోని డైలాగ్ అంటూ క్లారిటీ చేశాడు. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏకంగా జెట్ విమానంలో శ్రీముఖి తో కలిసి ఒక రొమాంటిక్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. శ్రీముఖి కి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా విడుదల కాకుండానే ప్రోమో తో వీరి ఇంటర్వ్యూ గురించి రకరకాలుగా చర్చ జరుగుతుంది. శ్రీముఖి వయసు చిరంజీవి కూతుర్ల వయసు కంటే చాలా చిన్న అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కూడా ఆమెతో రొమాంటిక్ గా మాట్లాడడం ఆమె చేసే వ్యాఖ్యలకు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఆమె ఏదో సరదాగా మాట్లాడిన వాటికి రొమాంటిక్ యాంగిల్ కల్పించడం వంటివి చిరంజీవి చేయడంతో చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
Trolls On Chiranjeevi And Sreemukhi Interview Video
ఆ సమయంలోనే చిరంజీవిని ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్లుగా కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. నిజంగానే చిరంజీవి వయసు మీద పడుతున్నా కూడా ఏమాత్రం అలా ప్రవర్తించకుండా ఇంకా కుర్రాడి మాదిరిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆ విషయం చాలా మందికి నచ్చుతుంది. కానీ కొందరికి మాత్రం నచ్చక ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఆయన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే నయనతార కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సత్యదేవ్ మరియు సునీల్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కనుక సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకం.. మరి చిరుకి ఈ సినిమా చిరు విజయాన్నైనా అందించేనా చూడాలి.
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
This website uses cookies.