
Naga Manikanta : మణికంఠ చెప్పిన మాటలకి, చేసే పనులకి సంబంధమే లేదుగా.. తెగ ట్రోలింగ్..!
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని కంటెస్టెంట్స్ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి ఓ పట్టాన అర్ధం కావడం లేదు. మరోవైపు షోలో ఎవరికి ఎప్పుడు ఎలా హైప్ వస్తుందో కూడా సస్పెన్స్‌గానే ఉంటుంది. అయితే నాగ మణికంఠ గతం విని అంతా కనెక్ట్ అయిపోయారు. మొదటి వారం మొత్తం నాగ మణికంఠకు మంచి పాపులారిటీ దక్కింది. ఇంక రెండో వారం సింపథీ అనేది పక్కన పెట్టేసి ఆట మీద ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత అందరూ మెచ్చుకున్నారు. మణికంఠ గాడిలో పడ్డాడు అనుకున్నారు. మళ్లీ గాడి తప్పుతున్న అతని ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నాగ మణికంఠ హౌస్ లో అందరితో కాస్త కలివిడిగానే ఉంటున్నాడు. అయితే ఎవరితో కలిసి ఉంటాడో వారిని టార్గెట్ చేసినట్లు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. మొదట విష్ణుప్రియతో కలిసి ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత పాయింట్స్ వెతుక్కుని నామినేట్ చేశాడు. ఆ తర్వాత యష్మీతో కలిసి ఉన్నాడు. ఫ్రెండ్ అనే ముసుగులో తన హార్ట్ బ్రేక్ చేశాడు అంటూ యష్మీ కూడా ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఏది అన్ ఫెయిర్ అనడానికి ఉండదు. ఎవరి స్ట్రాటజీ వారిది. అయితే ఇప్పుడు తాజాగా మణికంఠ మీద వస్తున్న విమర్శలు ఏంటంటే.. అతను రాము రెమోలా మారిపోయాడు అంటున్నారు. ఎందుకంటే హౌస్ లో ఉన్న వారికి కిస్సులు, హగ్గులు ఇస్తూ నానా హంగామా చేస్తున్నాడు.
Naga Manikanta : మణికంఠ చెప్పిన మాటలకి, చేసే పనులకి సంబంధమే లేదుగా.. తెగ ట్రోలింగ్..!
నాగ మణికంఠ సోనియాకి ముద్దు పెట్టాడు. ఆమె సోఫాలో కూర్చుని పాట పాడిన తర్వాత ఆమెకు ముద్దు పెట్టాడు. అక్క అక్క అని పిలుస్తాడు ఆ అభిమానంతో అలా చేశాడు అనుకుందాం కాని, నైనికా కూర్చుని ఉంటే.. ఆమెను పలకరించి.. నీ వస్తువుల మీద ఈగ కూడా వాలనివ్వను అంటూ హగ్ చేసుకుని తల మీద ముద్దు పెట్టుకుని వెళ్లాడు. ప్రేరణ కుర్చీలో కూర్చుని ఉంటే నువ్వు చాలా క్యూట్ గా మాట్లాడతావ్ అంటూ హగ్ చేసుకుంటాడు. ఇంక యష్మీ విషయం అయితే వేరే లెవల్. ఆమెను నామినేట్ చేసినందుకు హర్ట్ అయ్యిందని కూల్ చేయడానికి వెళ్లాడు. ఆమెను హగ్ చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె అక్కడ అన్ కంఫర్ట్ గా ఫీలవుతూ చేయి తీ అని కూడా అంది. కానీ, మణికంఠ రెండోసారి కూడా హగ్ చేసుకున్నాడు. ఫ్రెండ్ షిప్ అనే ముసుగులో మనోడు దారుణమైన పనులు చేస్తున్నాడు అని కొందరు తిట్టిపోస్తున్నారు. అతను రియలా? ఫేకా అనే అనుమానం ఇప్పుడు అందరిలో కలుగుతుంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.