Samantha : సమంత ఇప్పుడు చేస్తే.. బ్రహ్మానందం 25 ఏళ్ల క్రితమే చేశాడట.. ఏంటది? సమంతపై ఎందుకు ట్రోల్స్?
Samantha : ప్రస్తుతం పుష్ప సినిమాలో ఊ అంటావా.. అంటూ పాట పాడి.. కుర్రకారు గుండెల్లో గుబులు లేపిన సమంత గురించే ఎక్కడ చూసినా చర్చ. తన ఐటెమ్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు తన ఐటెమ్ సాంగ్ పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.పాట పూర్తిగా చూపించలేదని.. ప్లేస్ సరిగ్గా లేదని.. సమంత గ్లామర్ షోపై కూడా ట్రోల్స్, మీమ్స్ విడుదల అవుతున్నాయి.
అందులో ఒక మీమ్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.మా బ్రహ్మీ స్టయిల్ ను కాపీ చేయడం ఇకనైనా నువ్వు ఆపు.. అంటూ బ్రహ్మానందం, సమంత ఫోటోలను పెట్టి దాని మీద మీమ్ క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.అంతవరకు బాగానే ఉంది కానీ..
Samantha : నువ్వు ఇప్పుడే ఆ పోజు ఇచ్చావు.. నేను ఎప్పుడో ఇచ్చా.. అని చెప్పే మీమ్ అది
దాని మీద బ్రహ్మానందం స్పందించడమే వెరైటీగా ఉంది. అవును.. బ్రహ్మానందం ఆ ఘటనపై స్పందించారు. నేను ఆ పోజును 25 ఏళ్ల క్రితమే ఇచ్చాను. ఇప్పుడు బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందని చెప్పడం ఎంత దుర్మార్గం అంటూ బ్రహ్మానందం ఓ వేడుకలో కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది.