tulasi feels happy for teaching music to more children in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం మే 23, 2022 ఎపిసోడ్ 638 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెల్లారగానే ఇద్దరు పిల్లలు తులసి ఇంటికి వస్తారు. తులసి మేడమ్ కావాలి అని అడుగుతారు. దీంతో అనసూయ చూసి షాక్ అవుతుంది. తులసి మేడమ్ తో ఏం పని అని అడుగుతుంది అనసూయ. దీంతో సంగీతం నేర్చుకోవడం కోసం వచ్చాం అంటుంది. దీంతో అనసూయ ఎంతో ముచ్చటపడుతుంది. ఇంతలో తులసిని వెళ్లి తీసుకొస్తుంది అనసూయ. ఇదిగో నీ ఫ్యాన్స్ వచ్చారు అంటుంది అనసూయ. పిల్లల దగ్గరికి వెళ్లి ఎవరు మీరు అంటే.. మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాము అంటారు. దీంతో నేను సంగీతం నేర్పిస్తానని మీకు ఎవరు చెప్పారు అంటే.. మీరే కదా.. సంగీతం నేర్పబడును అని మీ వీడియో పోస్ట్ చేశారు అని చెబుతారు.
tulasi feels happy for teaching music to more children in intinti gruhalakshmi
దీంతో నా వీడియోనా అని షాక్ అవుతుంది. నిజానికి ఆ పని చేసింది దివ్య. ఇది నీ పనే కదా దివ్య అని అడుగుతుంది తులసి. ఎందుకు చేశావు ఇలా అని అడుగుతుంది తులసి. సరిపడా సంపాదన లేదంటూ రాత్రి నువ్వు బాధపడటం చూశాను అందుకే.. నువ్వు పాడిన పాటను ఇంటర్నెట్ లో షేర్ చేసి.. దాని కింద సంగీతం నేర్పబడును అని పెట్టాను అని చెబుతుంది దివ్య. ఏదీ ఆ వీడియో నాకూ చూపించవే అని అడుగుతుంది అనసూయ. టీచర్.. మాకు సంగీతం నేర్పిస్తారా అని అడుగుతారు పిల్లలు. దీంతో నేర్పిస్తాను. సాయంత్రం రండి. అలాగే మీ అమ్మ వాళ్లను కూడా తీసుకొని రండి అంటుంది తులసి.
ఆ తర్వాత తులసి సంతోషిస్తుంది. అమ్మా.. తులసి.. ఈరోజు ఇద్దరు. కొన్ని రోజుల్లో వంద మంది అవుతారు. అలా.. మన ఇల్లే సంగీత పాఠశాల అవుతుంది అంటుంది అనసూయ. మా మామ్ కు టైమ్ వచ్చింది. ఇక ఎవ్వరూ ఆపలేరు అని అంటుంది దివ్య. పెట్టిన గంటలోనే వీడియో వైరల్ గా మారి.. 10 వేల లైకులు వచ్చాయి అని అంటుంది దివ్య.
మరోవైపు శృతి పనికి వెళ్తూ.. నేను పనికి వెళ్లి వస్తాను.. అన్నం వండి పెట్టాను.. పెట్టుకొని తినండి అని చెబుతుంది. దీంతో ప్రేమ్ కు కోపం వస్తుంది. నేను ఇంట్లో కూర్చొని తినడానికే పనికొస్తానని చెబుతున్నావా అని శృతిని కోప్పడతాడు.
ఆ తర్వాత ప్రేమ్ ను సముదాయిస్తుంది శృతి. తర్వాత నేను ఆఫీసుకు వెళ్లి వస్తాను అంటుంది శృతి. పదా.. నేను కూడా వస్తా. నిన్ను మీ ఆఫీసు దగ్గర పంపించి వస్తా అంటాడు ప్రేమ్. వద్దులే అన్నా కూడా వినడు ప్రేమ్. దీంతో భయపడుతూనే తనతో వెళ్తుంది శృతి.
తర్వాత స్టవ్ మీద పాలు పెట్టి అలాగే వచ్చేశాను అంటుంది శృతి. నువ్వు వెళ్లి చూడు.. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటుంది శృతి. నాకు ఆఫీసుకు లేట్ అవుతోంది. నువ్వు వెళ్లు ప్రేమ్.. అంటుంది శృతి. దీంతో సరే అని ప్రేమ్ అక్కడి నుంచి వెళ్తాడు.
మరోవైపు లాస్య.. నందును సతీశ్ దగ్గరికి తీసుకెళ్తుంది. తనకు ఉద్యోగం కావాలని.. ఎలాగైనా ఇప్పించాలని అడుగుతుంది. అవసరంలో ఉన్నాం.. ఆయనకు జాబ్ కావాలి అని అంటుంది. దీంతో నందగోపాల్ సీనియారిటీని బట్టి కొంచెం సీనియారిటీ ఉన్న జాబ్ ఇవ్వాలి. ప్రోగ్రామర్ జాబ్ అయితే వెంటనే ఇవ్వగలం అంటాడు సతీశ్.
ప్రోగ్రామర్ జాబ్ ఇవ్వడం అంటే నన్ను అవమానించడమే అంటాడు నందు. నా ఆత్మాభిమానం నాకు ఉంది. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ఇలాంటి వాళ్ల దగ్గర తల వంచుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
కట్ చేస్తే.. ప్రేమ్ తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడ చూస్తే.. స్టవ్ మీద పాలే లేవు అని అనుకుంటాడు. మరోవైపు శృతి పని చేసేది ఎక్కడో కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లోనే. శృతి.. తన ఇంట్లో పని చేస్తున్న సమయంలోనే.. ప్రేమ్ వస్తాడు. తనను మరోసారి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతాడు.
కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఒప్పుకోడు. ఇంకోసారి నా ముందు కనబడకు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు మ్యూజిక్ డైరెక్టర్. నా భర్తనే తిడతావా అని కాఫీ తన కాళ్ల మీద పడబోసేలా చేస్తుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.