Home » Entertainment » Tv Actress Lahari With Her Mother Reel Video
Entertainment

TV Actress Lahari : వామ్మో బుల్లితెర నటి లహరి మదర్ ఇలా ఊపేస్తోందేంటి?.. వీడియో వైరల్

Authored By
aruna
The Telugu News | Published on: August 10, 2022, 12:40 pm
Advertisement

TV Actress Lahari : బుల్లితెర నటీనటులు ఈ మధ్య తన ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా ఎక్కువగా ఫేమస్ చేసేస్తున్నారు. సోషల్ మీడియా పెరిగిన తరువాత అందరూ కూడా మరింత యాక్టివ్ అవుతున్నారు. సెలెబ్రిటీలు అయితే తమ ఫాలోవర్లను పెంచుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా బుల్లితెర తారలు అయితే నానా హంగామా చేస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాను బుల్లితెరలు తెగ వాడుకుంటున్నారు. యూట్యూబ్ చానెళ్లు, ఇన్ స్టాగ్రాం రీల్ వీడియోలంటూ తెగ సందడి చేస్తున్నారు. ఇక బుల్లితెర తారలు మాత్రమే కాకుండా తమ తమ కుటుంబ సభ్యులను కూడా లైమ్ లైట్‌లోకి తీసుకొస్తున్నారు. తాజాగా బుల్లితెర నటి లహరి తన తల్లితో కలిసి నడి వీధుల్లో వేసిన స్టెప్పులు, దానికి సంబంధించిన రీల్ వీడియోను షేర్ చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై లహరి తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు అయితే గృహలక్ష్మీ సీరియల్‌లతో శ్రుతి పాత్రలో అందరినీ మెప్పిస్తోంది.తెరపై ఎంతో పద్దతిగా కనిపించే ఈ లహరి..

TV Actress Lahari With Her Mother Reel Video

Advertisement

కాంట్రవర్సీలతో ఎక్కువగా ఫేమస్ అయింది. ఆ మధ్య ఓసారి హిట్ అండ్ రన్ కేసులో వైరల్ అయింది. బైకు మీద వెళ్లే వ్యక్తిని లహరి ఢీ కొట్టేసింది. ఆ సమయంలో లహరి తాగి ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అలా మొత్తానికి లహరి ఏదో ఒక విషయంతో ఫేమస్ అవుతూ వస్తోంది. తాజాగా తన తల్లితో కలిసి రీల్ వీడియో చేసింది. అందులో లహరి తల్లి తెగ ఊపేసింది. లహరి కంటే వాళ్ల అమ్మే అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది.చూస్తుంటే లహరి ప్రస్తుతం వెకేషన్‌లో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు తెలుస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి