Haritha – Sreevani : బుల్లితెరపై తారలంతా కూడా ఇప్పుడు సైడ్ బిజినెస్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా యూట్యూబ్ చానెల్ పెట్టేసుకున్నారు. వాళ్లింట్లో ఏం జరిగినా, ఏకొత్త వస్తువు కొన్నా కూడా వీడియోలు చేసి పడేస్తుంటారు. మరీ దారుణంగా కిచెన్ టూర్ అని, అందులో ఫ్రిడ్జ్ టూర్ అని, బెడ్రూం టూర్ అని ఇలా పైత్యాన్ని అంతా కూడా చూపిస్తున్నారు. ఇక అలా ఇప్పుడు ప్రతీ ఒక్కరూ చానెళ్లలతో బాగానే సంపాదిస్తున్నారు. హరిత జాకీ, శ్రీవాణి, శివజ్యోతి, మహి శివన్ ఇలా అందరూ కూడా యూట్యూబ్ చానెళ్లతో దూసుకుపోతోన్నారు. గత నెల నుంచి శ్రీవాణి గొంతుకు సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ నెల పాటుగా ఒక్క ముక్క కూడా మాట్లాడటానికి వీల్లేదని వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సైగలతోనే బతికేస్తోంది. అయినా కూడా వీడియోలు చేయడం మాత్రం ఆగడం లేదు…
ఆ సైగలతోనే వీడియోలు చేస్తూ బాగానే సంపాదించేసుకుంటోంది. అయితే తాజాగా వరలక్ష్మీ వ్రతం అంటూ హరిత తన ఇంట్లో గ్రాండ్‌గా పూజను చేసింది. దీనికి తన సన్నిహితులందరినీ పిలిచింది. ఇందులో భాగంగా ఆమని, గృహలక్ష్మీ లాస్య, ఉదయ భాను, శ్రీవాణి ఇలా అందరూ గెస్టులుగా వచ్చారు. అయితే ఈ వీడియోలో హరిత కన్నీరు పెట్టేసుకుని అందరినీ ఎమోషనల్ చేసింది.
శ్రీవాణి గొంతు సమస్య తెలుసుకుని హరిత కన్నీరు పెట్టేసింది. తనకేం కాలేదని, అంతా ఒక నెలలో సెట్ అవుతుందని శ్రీవాణి సైగ చేస్తుంది. అయినా కూడా హరిత మాత్రం ఏడుపు ఆపదు. ఇక ఉదయ భానుకి కూడా విషయం తెలిసి ఎమోషనల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీవాణి కూతురు కూడా సందడి చేసింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.