Home » Entertainment » Two Actors Acted Son Lover Husband With Anushka Shetty
Entertainment

Anushka Shetty : అనుష్క కి కొడుకు గా , లవర్ గా, మొగుడు గా చేసిన ఇద్దరు స్టార్ హీరోస్ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 4, 2023, 11:00 am
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ లో నాగార్జున ‘ సూపర్ ‘ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. అరుంధతి సినిమాతో తన క్రేజ్ మారిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. బాహుబలి సినిమాతో ఆ క్రేజ్ ఇంకా పెరిగింది. అయితే బాహుబలి తర్వాత అనుష్క సినిమాలను తగ్గించేశారు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం సినిమాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమాలో నటిస్తుంది.

Advertisement

two actors acted son, lover, husband with Anushka Shetty

ఇటీవల ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ లుక్ విడుదలైంది. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది అనుష్క. కానీ ఇద్దరు హీరోలు మాత్రం ఆమెకు కొడుకుగా, లవర్ గా, భర్తగా నటించారు. వారిద్దరే ప్రభాస్, అడవి శేషు. ఇక టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్కల జోడి కి చాలామంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరూ చాలా హిట్ సినిమాల్లో నటించారు. బిల్లా, మిర్చి సినిమాల్లో అనుష్క ప్రభాస్ కి లవర్ గా నటించింది. అలాగే బాహుబలి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా ఒక పాత్రలో భార్యగా మరొక పాత్రలో నటించింది.

Advertisement

two actors acted son, lover, husband with Anushka Shetty

అలాగే మరో హీరో అడవి శేషు కూడా అనుష్కకి భర్తగా, లవర్ గా, కొడుకుగా నటించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిన అడివి శేష్. కెరీర్ ప్రారంభం లో చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ అనుష్క నటించిన సైజ్ జీరో సినిమా లో అనుష్కకి లవర్ గా నటించాడు. అలాగే నాగార్జున, కార్తీ నటించిన ‘ ఊపిరి ‘ సినిమా లో అనుష్కకి భర్తగా నటించాడు. అదే విధంగా బాహుబలి సినిమా లో అడివి శేష్ భల్లాల దేవుడికి కొడుకుగా నటించారు

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి