Sudigali Sudheer : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్ గా మారి తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ‘ సాఫ్ట్ వేర్ సుధీర్ ‘ సినిమాతో హీరోగా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కానప్పటికీ సుధీర్ కి వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత ‘ త్రీ మంకీస్ ‘ సినిమాను తన జబర్దస్త్ టీం గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లతో కలిసి చేశాడు. ఇక తర్వాత ‘ గాలోడు ‘ సినిమా చేసి కెరియర్లో మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఏకంగా ఏడు కోట్లు వసూళ్లను సాధించింది. దీంతో హీరోగా సుడిగాలి సుధీర్ కి మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవడంతో యంగ్ డైరెక్టర్ లు సుధీర్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా సుధీర్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఇది సుడిగాలి సుదీర్ నాలుగో సినిమాగా రాబోతూ ఉండడం విశేషం. మహా తేజ క్రియేషన్స్ బ్యానర్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయింది. విశ్వక్సేన్ నటించిన ‘ పాగల్ ‘ సినిమాతో నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఇది అతనికి రెండో సినిమా కావడం విశేషం. ఇక తేజ సజ్జా, శివాని రాజశేఖర్ కాంబినేషన్ లో ‘ అద్భుతం ‘ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వారి బ్యానర్ లో ఇది రెండవ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ బ్యూటీ దివ్యభారతి ఎంట్రీ ఇవ్వబోతోంది. కాంబినేషన్ పరంగా ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి. మరీ సుధీర్ కి హీరోగా ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే సుధీర్ కెరీర్ కి ఎటువంటి ఢోకా ఉండదు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.