Urvashi Rautela : ప్రస్తుతం ప్రపంచమంతా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇండియాకు చెందిన క్రికెట్ అభిమానులు అందరూ వరల్డ్ కప్ మ్యాచ్ లను అన్నింటినీ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ కి చాలా క్రేజ్ వచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. దాయాదుల పోరు అంటే మామూలుగా ఉంటుందా? రచ్చ రచ్చే కదా. అదే జరిగింది. స్టేడియం మొత్తం క్రికెట్ అభిమానులతో మారుమోగిపోయింది. ఈ మ్యాచ్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. వాళ్లంతా కలిసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ ని కూడా నిర్వహించారు. ఆ మ్యాచ్ కు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా కూడా వచ్చింది.
తను ఈ మ్యాచ్ లో ఆడిపాడింది. మ్యాచ్ అయిపోయే దాకా తను స్టేడియంలోనే ఉంది. అయితే.. మ్యాచ్ సంబురంలో తన దగ్గర ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేసి ఐఫోన్ ను పోగొట్టుకుంది. అసలు ఐఫోన్ అంటేనే చాలా కాస్ట్ లీ. అలాంటిది.. 24 క్యారెట్ల గోల్డ్ తో చేసిన ఫోన్ అంటే ఇక దాని ధర లక్షల్లో కాదు.. కోట్లలో ఉంటుంది. ఆ ఫోన్ నే స్టేడియంలో మిస్ చేసుకుంది ఊర్వశి రౌటెలా. మ్యాచ్ ముగిసిన తర్వాత తన జేబులో చెక్ చేసుకుంటే తన ఫోన్ కనిపించలేదు. అక్కడ ఎంత వెతికినా కనిపంచలేదట. దీంతో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది ఊర్వశి.
మ్యాచ్ లో తాను 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేసిన బంగారు ఐఫోన్ ను పోగొట్టుకున్నా. దయచేసి మీకు ఎవరికైనా దొరికితే నాకు తిరిగి ఇచ్చేయండి.. అంటూ ఊర్వశి వేడుకుంది. అలాగే.. తన ఫోన్ దొరికేలా సహకరించాలంటూ అహ్మదాబాద్ పోలీసులను కూడా ఊర్వశి కోరింది. అయ్యో పాపం.. అంత విలువైన ఐఫోన్ ను అలా ఎలా పోగొట్టుకున్నావు పాప.. పోయిన పోన్ దొరకుతుందా? అది మామూలు ఫోన్ కూడా కాదాయె.. అందులోనూ ఆ ఫోన్ లో సీక్రెట్ వీడియోలు ఉన్నాయట. ఆ వీడియోలు ఎక్కడ బయటపడతాయో అని ఊర్వశి తెగ టెన్షన్ పడుతుండటంతో.. ఆ ఫోన్ మీద ఆశ వదిలేసుకో అని నెటిజన్లు ఆమెకు సలహాలు ఇస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.