Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఎంతిచ్చారో తెలుసా ?

 Authored By sudheer | The Telugu News | Updated on :18 March 2026,3:30 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఎంతిచ్చారో తెలుసా ?

Pawan Kalyan : సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను వీక్షించి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఇది పవన్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన సినీ అనుభవాన్ని అందించనుందని టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎనర్జీ తగ్గకుండా సాగుతుందని, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కాకుండా ఆకట్టుకుంటుందని సమాచారం.

Ustad Bhagat Singh Censor Review

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఎంతిచ్చారో తెలుసా ?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు, హరీష్ శంకర్ మాస్ టచ్

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌, దర్శకుడు హరీష్ శంకర్ తన ప్రత్యేక శైలిలో కొత్తగా ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. సినిమా మొదటి భాగం మొత్తం వేగంగా సాగుతూ, కామెడీ మరియు యాక్షన్ సమతౌల్యంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, స్టైల్, మ్యానరిజమ్స్ అభిమానులను మరింతగా ఆకట్టుకునేలా రూపొందించారని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం. థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించేలా భారీ ఎలివేషన్ సన్నివేశాన్ని రూపొందించారని టాక్ వినిపిస్తోంది. ఇది పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దిన ఘట్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Pawan Kalyan : సంగీతం, సెకండాఫ్ భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణ

ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ మరో ప్రధాన బలంగా నిలిచారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా మార్చిందని సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సంగీతం, పవన్ కళ్యాణ్ యాక్షన్ కలయిక ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందని చెబుతున్నారు. సెకండాఫ్‌లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన సామాజిక సందేశం కూడా ఉందని తెలుస్తోంది. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఈ అంశాలు సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సెన్సార్ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని, దాదాపు 5లో 3 రేటింగ్‌కు అర్హత సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో పాటు పాజిటివ్ టాక్ రావడం వల్ల, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026లో ఈ సినిమా అతిపెద్ద హిట్‌గా నిలిచే అవకాశముందని కూడా చర్చ జరుగుతోంది.

 

 

 

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి