Home » Entertainment » Vadinamma 22 October 2021 Friday Episode
Entertainment

Vadinamma 22 Oct Today Episode : ఘనంగా రఘురామ్, సీత పెళ్లి రోజు.. సంతోషంలో రఘురామ్ ఫ్యామిలీ.. ఇంతలో అనుకోని షాక్

Authored By
Varun G
The Telugu News | Published on: October 22, 2021, 2:50 pm
Advertisement

Vadinamma 22 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 680 లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్న, వదిన పెళ్లి రోజును ఘనంగా చేయాలని అందరూ అనుకుంటారు. సీత, రఘురామ్ ఇద్దరినీ పిలిచి వాళ్ల పెళ్లిరోజును ఘనంగా చేసేందుకు డెకరేషన్ చేస్తారు. మొత్తం మీద ఫ్యామిలీ మొత్తం సంతోషంగా గడుపుతుంది.

Advertisement

vadinamma 22 october 2021 friday episode

తన చెల్లి, బావ గురించి చెబుతాడు సీత అన్న. కానీ.. సీత వదిన మాత్రం సీత మీద విరుచుకుపడుతుంది. సీత మాట మీ బావ వింటాడు కాబట్టే వాళ్ల దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది అంటుంది. పదా.. అని ఇంట్లోకి వెళ్తారు. భాస్కర్ ఇంట్లోకి వెళ్లి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతాడు. ఆది దంపతుల్లా, సీతారాముల్లా ఉన్నారు. వీళ్లను ఎంత సేపు చూసినా తనివి తీరదు లక్ష్మణ్ అంటాడు భాస్కర్.

Advertisement

ఇంతలో పార్వతమ్మ, తన భర్తతో కలిసి సీత ఇంటికి వస్తుంది. నాన్నా.. అమ్మ అంటూ సిరి పరిగెడుతుంది. రండి అమ్మ అంటుంది. పిన్ని, బాబాయి బాగున్నారా? అని అడుగుతుంది సీత. ఏంటి మామయ్య ఇది ఇంత ఆలస్యంగానా రావడం అంటాడు భరత్. నేను ఉదయమే రెడీ అయ్యాను. మీ అత్తయ్య రెడీ అవ్వడానికి ఇంత టైమ్ పట్టింది అని అంటాడు.

Vadinamma 22 Oct Today Episode : దుర్గ, పార్వతమ్మ ముచ్చట్లు

భాస్కర్ ఎంత సేపు అయింది వచ్చి.. అని భరత్ మామయ్య అడుగుతాడు. దుర్గను పిలిచి పార్వతమ్మ మాట్లాడుతుంది. బయటికి వెళ్దాం పదా అని అంటుంది పార్వతమ్మ. ఇద్దరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. పెళ్లి రోజుకు రానని చెప్పావు కదా.. మరి ఎందుకు వచ్చావు అని అంటుంది దుర్గ. సరే కానీ.. నీ ఆడబిడ్డ వేడుకను పాడు చేయకుండా అలాగే కూర్చున్నావు ఏంటి అంటుంది పార్వతమ్మ.

Advertisement

vadinamma 22 october 2021 friday episode

ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండటం.. రఘురామ్, సీత ఒకరిని మరొకరు స్నాక్స్ తినిపించుకోవడం చూసి దుర్గ, పార్వతమ్మ అస్సలు ఓర్చుకోరు. ఈ ఇంటికి నవ్వులు, సంతోషం అస్సలు కలిసిరావు. ఈ ఇంట్లో త్వరలో సునామి వస్తది. అందరూ విడిపోతారు.. అని జోస్యం చెబుతుంది పార్వతి. సంతోషంగా కాలిపోవడానికి క్షణం చాలు. వరుసగా నెల దినాలు వాళ్లు సంతోషంగా ఉండటం నువ్వు చూశావా? ఇప్పుడు అదే… అంటూ దుర్గతో చెబుతుంది పార్వతమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి