Vakeel saab : వకీల్ సాబ్ కి ఏప్రిల్ సెంటిమెంట్.. అయితే బ్లాక్ బస్టర్ లేదా భారీ ..?

Authored By vamana sai | The Telugu News | Published on: February 2, 2021, 1:01 pm

Vakeel saab : వకీల్ సాబ్ కి ఏప్రిల్ సెంటిమెంట్ ని తగ్గించారట పవన్ కళ్యాణ్ అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా బోనీకపూర్ సమర్పిస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో అన్నీ కార్యక్రమాలని పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిందీ తో పాటు తమిళ రీమేక్ సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ తో పాటు భారీ డిజాస్టర్స్ గా మిగిలినవి ఉన్నాయి.

vakeel-saab-april-sentiment-block-buster-hit

vakeel-saab-april-sentiment-block-buster-hit

అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏప్రిల్ నెల సెంటిమెంట్ కూడా ఉంది. ఈ విషయాన్ని తాజాగా అభిమానులు చర్చించుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ కెరీర్ లో పలు సినిమాలు ఏప్రిల్ లో విడుదలయ్యాయి. అందులో ఇండస్ట్రీ హిట్ తో పాటు భారీ డిజాస్టర్ కూడా ఉన్నాయి. ఖుషి సినిమాతో పవన్ స్టార్ హీరోగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఖుషి సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బద్రి.. జల్సా.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు కూడా ఏప్రిల్ లోనే వచ్చాయి. ఈ సినిమాలన్ని పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఇండస్ట్రీ రికార్డ్స్ గా నిలిచాయి.

Vakeel saab : వకీల్ సాబ్ ఏ సినిమాల లిస్ట్ లో చేరుతోంది..?

కాగా పవన్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా జానీ. గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజైంది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ సినిమాని ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నారు. దాంతో గతంలో పవన్ కళ్యాణ్ నటించగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల లిస్ట్ లో వకీల్ సాబ్ చేరుతుందా లేదా భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల లిస్ట్ లో చేరుతుందా అని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి వకీల్ సాబ్ ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp